Prabhas Vs Yash movie updates(Film news in telugu today): ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం బడా హీరోల సినిమాలే రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కొత్త కొత్త నటులు పుట్టుకొస్తున్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోలు ఏడాది లేదా రెండేళ్లకు ఒక సినిమా చేస్తుంటే.. చిన్న చిన్న హీరోలు మాత్రం ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో సినిమా సినిమాకి మధ్య క్లాస్ ఏర్పడుతుంది. దీని కారణంగానే కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి.
ఈ మధ్య ఈ వ్యవహారం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ కీర్తి అమాంతంగా పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. అదే సమయంలో కొత్త కొత్త దర్శకులు, హీరోలు పుట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు తెరకెక్కించి అలరిస్తున్నారు. ప్రతి శుక్రవారం వచ్చేసరికి దాదాపు ఐదారు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. దీంతో ఏ సినిమా వెనక్కి తగ్గకపోవడంతో క్లాస్ ఏర్పడి విభేదాలు వస్తున్నాయి.
Also Read: ‘రాజాసాబ్’ గ్లింప్స్ రిలీజ్.. ప్రభాస్ ఏమున్నాడురా బాబు
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే టాలీవుడ్‌లో చోటుచేసుకుంది. క్లాస్ అండ్ మాస్ హీరోలైన ప్రభాస్, యష్ సినిమాల మధ్య పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో అందాల ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అంచనాలు అమాంతంగా పెంచేశాయి.
ఇప్పటి వరకు సలార్, కల్కి సినిమాలలో ఊరమాస్ యాక్షన్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ రాజాసాబ్ మూవీతో మళ్లీ లవర్ బాయ్‌గా కనిపిస్తున్నాడు. అతడి లుక్ అందరినీ బాగా ఇంప్రెస్ చేసింది. అయితే ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే తేదీకి ‘కేజీఎఫ్’ హీరో యష్ నటిస్తున్న కొత్త సినిమా ‘టాక్సిక్’ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టాక్సిక్ సినిమా కూడా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుగుతుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయనే వార్త ఇరువురి ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తుంది. చూడాలి మరి దీనిపై ఎలాంటి అప్డేట్ వస్తుందో.