E-Paper
Advertisement

Ramcharan Bollywood Movie: గ్లోబల్ స్టార్ తో బాలీవుడ్ బడా డైరెక్టర్ మూవీ…ఇక మెగా ఫాన్స్ కి పూనకాలు లోడింగ్…

Ramcharan Bollywood Movie: గ్లోబల్ స్టార్ తో బాలీవుడ్ బడా డైరెక్టర్ మూవీ…ఇక మెగా ఫాన్స్ కి పూనకాలు లోడింగ్…
Advertisement

Ramcharan Bollywood Movie: చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్… అంచలంచలుగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తర్వాత అతని ఫ్యాన్ వేస్ యావత్ ప్రపంచంలో విస్తరించింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీస్ కూడా మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో వాటిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కు సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

బాలీవుడ్ లో ఒక బరా డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది. ఇంకా ఈ వార్తపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనప్పటికీ.. ఈ న్యూస్ నిజమైతే మాత్రం అది బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ గా మారుతుంది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అతను చేయబోతున్న డైరెక్టర్ ఆషామాషీ వ్యక్తి కాదు…అతను మరెవరో కాదు…బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ.

Advertisement

కొద్దిరోజుల క్రితం రామ్ చరణ్ ముంబైలోని ఒక రెస్టారెంట్లో రాజ్ కుమార్ హిరానీ ను కలిసి నట్టు విశ్వసనీయవర్గాల బోగట్ట. ప్రజెంట్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేజర్ మూవీ చేస్తున్నారు. మరోపక్క రాజ్ కుమార్ హిరానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో డంకీ సినిమా చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల షూటింగ్ దాదాపు పూర్తి కాబోతోంది.డంకి మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రాజ్ కుమార్ ..రామ్ చరణ్ తో మూవీ పై ఆసక్తి చూపిస్తున్నారట. రీసెంట్గా ముంబైలో జరిగిన మీటింగ్లో వీళ్ళిద్దరి మధ్య స్టోరీ గురించి కూడా డిస్కషన్ జరిగినట్లు టాక్.

ఈ బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేయడం కోసం బాలీవుడ్ స్టార్స్ ఆసక్తిగా ఉంటారు. అలాంటిది ఆయన రామ్ చరణ్ తో మూవీ చేస్తాడు అంటే అది టాలీవుడ్ కే పెద్ద క్రెడిట్. నిజంగా వస్తున్న గాసిప్స్ ప్రకారం ఈ న్యూస్ కరెక్ట్ అయితే మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ వల్ల బాక్స్ ఆఫీస్ ఇప్పటివరకు ఉన్న లెక్కలు షేక్ అవ్వక మానదు. ప్రస్తుతం ఈ వార్తను మెగా ఫాన్స్ ఖుషి ఖుషీగా షేర్ చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×