E-Paper
Advertisement

Ramya Pasupuleti: చిరంజీవిని ఫోటో అడిగితే.. నీకోసం త్వరగా రావాలా అన్నారు

Ramya Pasupuleti: చిరంజీవిని ఫోటో అడిగితే.. నీకోసం త్వరగా రావాలా అన్నారు
Advertisement

Ramya Pasupuleti:అచ్చ తెలుగు హీరోయిన్ల లిస్ట్ లో రమ్య పసుపులేటి కూడా చేరిపోయింది. హుషారు సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ.. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో మెయిన్ హీరోయిన్  గా నటిస్తోంది.  ఈ సినిమాలో మేడమ్ సార్ మేడమ్ అంతే  అనే సాంగ్ తో రమ్య సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది. ఇక  ఇది కాకుండా ఈ చిన్నది విశ్వంభరలో నటిస్తుంది అని  తెలిసాకా.. మరింత ఫేమస్ అయ్యింది.

చిరంజీవి, త్రిష జంటగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  విశ్వంభర. ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా  రమ్య ఎంపిక అయ్యింది. ఇక మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూ లు ఇస్తున్న రమ్య.. చిరు గురించి, విశ్వంభర గురించి చెప్పుకొస్తుంది. తాజాగా రమ్య పసుపులేటి.. దావత్  చిట్ చాట్ షోకు గెస్ట్ గా విచ్చేసింది. అరియనా యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పింది.

Advertisement

విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు కదా.. చిరంజీవి గారితో వర్క్ ఎక్సీపీరియెన్స్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు రమ్య మాట్లాడుతూ.. ” నేనొక ఇన్సిడెంట్ చెప్తాను. చిరంజీవి గారిని సెట్ లో చూసిన మొదటిసారి.. సార్, ఒక్క ఫోటో ఇవ్వండి అని అడిగాను. దానికి ఆయన.. నీకోసం నేను త్వరగా రావాలా అని వెళ్లిపోయారు. ఆ తరువాతి రోజు డైరెక్టర్ కాల్ చేసి.. చిరంజీవిగారు వచ్చారు.. నీకోసం, త్వరగా రా అని అన్నారు. అలా నాకోసం ఆరోజు చిరంజీవిగారు వచ్చారు. ఆ ఫోటోనే నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను” అని చెప్పింది.

సెట్ లో షూటింగ్  లో లేకపోయినా.. రమ్య ఫోటో అడిగిందని చిరు త్వరగా సెట్ కు వచ్చినట్లు ఆమె తెలిపింది.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు  నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ రెండు సినిమాలతో రమ్య స్టార్ లిస్ట్ లో చేరుతుందా.. ? హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందా..? అనేది చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×