Tips For Better Sleep: ఆరోగ్యంగా ఉండటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరానికి తగినంత నిద్ర పోయినప్పుడే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నిద్ర లేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన శైలి కారణంగా నిద్ర పోయే వేళలు కూడా మారుతున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు అనారోగ్య సమస్యల కారణంగా కూడా కొందరికి రాత్రి సమయాల్లో నిద్ర సరిగ్గా పట్టదు. రాత్రి నిద్రపోయే ముందు కొందరికి పొట్టనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ప్రారంభం అవుతుంటాయి. పిల్లల్లో కూడా ఒక్కోసారి ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చేస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.
రాత్రి భోజనం పూర్తి చేశాక పొట్ట ప్రశాంతంగా ఉంటేనే చక్కగా నిద్రపడుతుంది. కొంత మంది నిద్రపోయే ముందు చాలా ఇబ్బంది పడుతుంటారు. పొట్టలో గ్యాస్ ఏర్పడడం, పొట్ట నొప్పి వంటి సమస్యలు రాత్రి సమయాల్లో ఎక్కువగా వస్తుంటాయి. పొట్ట అసౌకర్యంగా ఉండడం వల్ల నిద్ర పట్టదు. అంతేకాకుండా ప్రతి రోజు పొట్ట అసౌకర్యంగా ఉంటే నిద్రలేమి సమస్యకు ఇది దారితీస్తుంది.
నిద్రపోయే ముందు చేసే చిన్న పనులు గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా చేస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. గ్యాస్ సమస్య తరచూ రాత్రిపూట వేధిస్తుంటే నిద్రించే ముందు చిన్న పని చేయండి. ఇది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా మంచిగా నిద్రపోయేందుకు సహాయపడుతుంది.
ఏం చేయాలంటే..
నిద్రపోయే ముందు పొట్టలో గ్యాస్ ఏర్పడే సమస్య వస్తే కార్బోహైడ్రెట్లు అందుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. మీరు రాత్రిపూట ఎక్కువ కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు పొట్టలో గ్యాస్ ఏర్పడడానికి ఇది కారణమవుతుంది. నిద్ర పోతున్నప్పుడు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లతో కలిసి గ్యాస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభమవుతుంది.
రాత్రిపూట ఏర్పడి గ్యాస్ ఎలా వదిలించుకోవాలి..
రాత్రిపూట గ్యాస్ ఏర్పడే సమస్య రాకుండా ఉండాలంటే భోజనం చేశాక కనీసం పావుగంట సేపు వాకింగ్ చేయడం మంచిది. ఇది గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది. అలాగే పొట్ట మీద రోజు తిన్న తర్వాత మసాజ్ చేస్తూ ఉండాలి. యోగా నిపుణులు కూడా పొట్టమీద మసాజ్ చేయడం వల్ల గ్యాస్ ఏర్పడకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు.
ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. ఇలా ఇలా చేతుల గుండా వెళ్లే నాడులను ఇది యాక్టివ్ చేసి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అంతే కాకుండా అరచేతులకు నూనె రాసి అరచేతులను కలిపి రుద్దాలి.నిద్రలేమి సమస్య వేధిస్తుంటే రెండు చేతుల వేళ్లతో నుదుటి అంచులను సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియను కొన్ని సెకన్లపాటు నిరంతరం చేయడం వల్ల నిద్రపోవడానికి ఇది సహాయపడుతుంది.
Also Read: వీటితో స్కిన్ క్యాన్సర్ ప్రమాదం.. షాకింగ్ నిజాలు ఇవిగో !
ఈ ఆహారాలు వద్దు:
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలు తినకుండా ఉండడం మంచిది. పప్పులు, బంగాళాదుంపలు, శనగలు వంటివి రాత్రిపూట తినకపోవడం ఉత్తమం. అలాగే రాత్రి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉన్నవారు మానేయడం మంచిది. పాలు, పెరుగు వంటి గ్యాస్ ఉత్పత్తిని పెంచుతుంటాయి. క్యాబేజీ, బీన్స్, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా రాత్రి భోజనంలో తినకుండా ఉంటే మంచిది. గ్యాస్ నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే స్వీట్లు, బ్రెడ్ వంటివి కూడా రాత్రిపూట అస్సలు తినకూడదు, శీతల పానీయాలు, పండ్ల రసాలకు రాత్రివేళల్లో దూరంగా ఉండాలి. మొక్కజొన్న, గోధుమతో చేసిన ఆహార పదార్థాలు, మద్యం సేవించడం వంటివి రాత్రి పూట చేయకుండా ఉంటే మంచిది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)