BigTV English

Rana Naidu:‘రానా నాయుడు’ కోసం వెంక‌టేష్‌, రానా భారీ రెమ్యూనరేషన్స్

Rana Naidu:‘రానా నాయుడు’ కోసం వెంక‌టేష్‌, రానా భారీ రెమ్యూనరేషన్స్

Rana Naidu:మన స్టార్స్ అందరూ ట్రెండ్‌ని ప‌క్కాగా ఫాలో అయిపోతున్నారు. సిల్వ‌ర్ స్క్రీన్ మీద‌నే కాదండోయ్.. ఓటీటీల్లోనూ అద‌ర‌గొట్ట‌టానికి సిద్ధ‌మ‌య్యారు. తాజాగా ఈ లిస్టులో చేరారు మ‌న టాలీవుడ్ స్టార్స్ విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా ద‌గ్గుబాటి. వీరిద్ద‌రి కాంబోలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో టైటిల్ పాత్ర‌లో రానా న‌టిస్తే.. వెంకటేష్ నాగ అనే పాత్ర‌లో క‌నిపించారు. మార్చి 10 నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సంగ‌తి తెలిసిందే.


‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కోసం వెంక‌టేష్, రానా ఎంతెంత రెమ్యూన‌రేష‌న్స్ తీసుకున్నార‌నే దానిపై చాలా వార్త‌లు వినిపిస్తున్నాయి. సాధార‌ణంగా ఓ సినిమాకు ఐదు నుంచి ఆరు కోట్ల మేర‌కు వ‌సూలు చేసే హీరో వెంక‌టేష్ ఈ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్లు రెమ్యూరేష‌న్ తీసుకున్నార‌ట‌. అలాగే సినిమాకు ఆరు కోట్ల మేర వ‌సూలు చేసే రానా ఈ సిరీస్ కోసం రూ.8 కోట్లు తీసుకున్నార‌ని స‌మాచారం. రియ‌ల్ లైఫ్‌లో బాబాయ్ అబ్బాయ్ అయినా వెంకీ, రానాలు ‘రానా నాయుడు’లో తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు.

రీసెంట్‌గానే ‘రానా నాయుడు’ ట్రైల‌ర్‌ను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. వెంకీ, రానాలు త‌మ‌దైన యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. మ‌రి మార్చి 10న ఈ సిరీస్‌తో ఇంకెలా మెప్పిస్తారో వేచి చూడాల్సిందే. 2013లో రూపొందిన రే డొనోవ‌న్ అనే క్రైమ్ సిరీస్‌ను అడాప్ట్ చేసుకుని ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇంకా ఇందులో సుర్విన్ చావ్లా, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు న‌టించారు. క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సుప్ర‌న్ వ‌ర్మ ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు.


Kangana Ranaut : రాజ‌మౌళికి కాంట్ర‌వ‌ర్సీ కంగ‌నా స‌పోర్ట్‌..

Hansika: వ‌య‌సుకి మించి క‌న‌పడ‌టానికి హ‌న్సిక ఇంజెక్ష‌న్ష్ తీసుందా.. న‌టి రియాక్ష‌న్‌

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×