E-Paper
Advertisement

Rana Daggubati : ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై రానా ఫైర్‌

Rana Daggubati : ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై రానా ఫైర్‌
Advertisement

Rana Daggubati :టాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో ప‌లు చిత్రాలు చేసిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి. ఈ పాన్ ఇండియా యాక్ట‌ర్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. అస‌లేమంద‌నే వివ‌రాల్లోకి వెళితే, బెంగుళూరుకి కుటుంబ స‌భ్యుల‌తో ట్రావెల్ చేయ‌టానికి రానా ద‌గ్గుబాటి ఇండిగో ఎయిర్ లైన్స్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. శంషాబాద్ చేరుకుని చెక్ ఇన్ చేసుకున్నారు. ఫార్మాలిటీస్ పూర్త‌యిన త‌ర్వా త విమానం ఆల‌స్యం అయ్యింద‌ని సిబ్బంది తెలియ‌జేశారు. మ‌రో విమానంలో వెళ్లాలంటూ రిక్వెస్ట్ చేశారు. ల‌గేజీ కూడా అదే ఫ్లైట్‌కి పంపుతామ‌ని ఇండిగో సిబ్బంది తెలియ‌జేశారు. బెంగుళూరు చేరుకున్న త‌ర్వాత రానా ల‌గేజ్ రాలేదు. ఎక్క‌డో మిస్ అయ్యింది. ల‌గేజ్ ఏమైందో సిబ్బంది కూడా స‌రిగ్గా చెప్ప‌లేదు. దీంతో రానా ఇండిగో ఎయిర్ లైన్స్ సేవ‌ల‌పై ఫైర్ అయ్యారు.

‘‘ఇండిగో విమాన సేవలు సరిగ్గా లేవు. లగేజ్ మిస్ అయ్యింది. ట్రాకింగ్ సరిగ్గా లేదు. లగేజ్ ఎక్కడని ప్రశ్నిస్తే సిబ్బంది నుంచి సరైన సమాధానం లేదు. వారికే సరైన సమాచారం లేదు’’ అని రానా దగ్గుబాటి తన అసహనాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మరి దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది స్పందించ‌లేదు. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. రానా ఆ ట్వీట్‌ను తన ఖాతా నుంచి తొలిగించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×