BigTV English

MallaReddy: రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి.. మాటల మంటలు..

MallaReddy: రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి.. మాటల మంటలు..

MallaReddy: మల్లారెడ్డి. పక్కా మాస్ మల్లన్న. సీరియస్ కామెడీ పొలిటీషియన్. మాటలు, చేష్టలు డిఫరెంట్ గా ఉంటాయి. ఉన్నదున్నట్టు ఉంటారు. అందుకే, మంత్రి అయినా డ్యాన్సులు, మందు పోయడాలు, తొడగొట్టడాలు, పంచ్ డైలాగులు వేయడాలు.. అబ్బో అన్నిట్లో జబర్ధస్త్ మల్లారెడ్డి.


ఆయనపై అంతపెద్ద ఐటీ దాడులు జరిగినా.. మళ్లీ బిందాస్ గా మాట్లాడారు. తన కాలేజ్ ఫంక్షన్ లో మాటలతో కేక పెట్టించారు. అదే స్థాయిలో కాక రేపారు. జీవితంలో సాధించాలంటే.. ప్రేమ ఫ్రెండ్ షిప్ లాంటి వాటికి దూరంగా ఉండాలని.. కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాల్సిందేనంటూ స్టూడెంట్స్ కు తనదైన స్టైల్ లో హితబోధ చేశారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి.

నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరని.. కొడుకును డాక్టర్ ను చేస్తే తనకు డాక్టర్ కోడలు వచ్చిందని చెప్పారు. అదే, ఏ రెడ్డి అమ్మాయికో ఇచ్చి చేస్తే పిక్నిక్ లు, కిట్టీ పార్టీలు అంటూ వెళ్లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలే ఆయన్ను కార్నర్ చేశాయి.


అంటే, రెడ్డి అమ్మాయిలు కేవలం ఎంజాయ్ మాత్రమే చేస్తారా? ప్రయోజకులు కారా? రెడ్డి పిల్లలు పార్టీలకే ప్రాధాన్యం ఇస్తారా? అంటూ రెడ్డి కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దీంతో, వెంటనే మల్లారెడ్డి సారీ చెప్పారు. తన ఉద్దేశం అది కాదంటూ.. బాధపడి ఉంటే క్షమించమంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

మల్లారెడ్డి.. రెడ్డి అయినా కూడా ఆయనకు ఆ సామాజిక వర్గం నుంచి మొదటి నుంచీ ఇబ్బందే ఎదురవుతోంది. గతంలో రెడ్ల మీటింగ్ కు హాజరై.. సీఎం కేసీఆర్ ను తెగ పొగుడుతుంటే.. ఆ సభకు హాజరైన రెడ్లంతా మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో, బలవంతంగా మల్లారెడ్డిని.. ఆ రెడ్ల సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. వెళుతుంటే ఆయన కారును కూడా వెంబడించి దాడి యత్నం చేశారంటే వారిలో ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతోంది. అదంతా రేవంత్ రెడ్డినే చేయించారని.. దాడి చేసిందంతా ఆయన వర్గీయులేనని ఆ తర్వాత మల్లారెడ్డి ఆరోపించారు.

అప్పటి నుంచి రెడ్డి వర్సెస్ మల్లారెడ్డి ఎపిసోడ్ కొనసాగుతోంది. లేటెస్ట్ గా రెడ్డి అమ్మాయిల గురించి మంత్రి చేసిన కామెంట్లు.. ఆయన్ను రెడ్డి కమ్యూనిటీకి మరింత దూరం చేసేలా ఉన్నాయి. అందుకే, ఏందన్నా రెడ్డన్నా? కాస్త చూసుకొని మాట్లాడన్నా.. అంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×