BigTV English

Mobile Discount Offer: ఊచకోతే భాయ్.. సగం ధరకే రూ.19 వేల స్మార్ట్‌ఫోన్.. ఎక్కువసేపు ఉండదు!

Mobile Discount Offer: ఊచకోతే భాయ్.. సగం ధరకే రూ.19 వేల స్మార్ట్‌ఫోన్.. ఎక్కువసేపు ఉండదు!

Discount Offer on Motorola G32 Mobile: స్మార్ట్‌ఫోన్ల విప్లవం మొదలైప్పటి నుంచి ప్రపంచమంతా స్మార్ట్ అయిపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే మన పనులన్నీ స్మార్ట్‌గా ఈజీగా అయిపోతాయి. అందుకోసమే ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా బడ్జెట్‌లో మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మొబైల్ ఫీచర్లు ప్రీమియంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ మీకో శుభవార్త చెప్పింది.


Motorola G32 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.18,999లగా ఉంది. కానీ ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. రూ. 10,000 కంటే తక్కువకే దక్కించుకోవచ్చు. ఇందులో కంపెనీ బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఆఫర్ చేస్తోంది. మంచి డిస్‌ప్లే కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ధర, ఆఫరర్లు, ఫీచర్లు తదితర వివరాలను తెలుసుకోండి.

Also Read: ఓరయ్యా ఆఫర్ చూస్కో.. రూ.40 వేల ప్రీమియం మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్.. కెమెరా ఎంత బాగుందో!


Moto G32 స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌ని అమర్చారు. ఈ ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ Moto స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల పెద్ద స్క్రీన్‌తో పూర్తి HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో వీడియోలను చూడటం, గేమ్‌లు ఆడటం, ఇతర పనుల కోసం ఉపయోగించవచ్చు. ఇది కంటి సంరక్షణ కోసం IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90 Hz రీఫ్రెష్‌రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Motorola G32 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా గురించి మాట్లాడితే మీరు ఈ Moto స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరాలను పొందుతారు. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50MP ప్రధాన కెమెరా, f/2.2 ఎపర్చరుతో 8MP అల్ట్రా వైడ్ కెమెరా,  f/2.4 ఎపర్చరుతో 2MP మాక్రో కెమెరా ఉన్నాయి . సెల్ఫీ కోసం ఫోన్ f/2.2 ఎపర్చర్‌తో 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ పవర్ కోసం 5000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W టర్బో పవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 12 OSలో పనిచేస్తుంది.

Also Read: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌పై ధమాకా డిస్కౌంట్.. మరీ ఇంత చవక అనుకోలేదు!

Motorola G32 స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్ ధర సగానికి తగ్గించబడింది. 9000 తగ్గింపుతో ఈ ఫోన్ కేవలం 9,999 రూపాయలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ఫోన్ MRP రూ. 18,999. ఇది కాకుండా మీరు ఎంచుకున్న కొన్ని బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయడంపై రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపును కూడా పొందుతారు. కంపెనీ ఈ ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీని అందిస్తోంది.

Tags

Related News

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Big Stories

×