E-Paper
Advertisement

Rashmika Mandanna : మ్యానేజర్ చేతిలో మోసపోయిన రష్మిక..!

Rashmika Mandanna :  మ్యానేజర్ చేతిలో మోసపోయిన రష్మిక..!
Advertisement
Rashmika Mandanna

Rashmika Mandanna : మామూలుగా హీరోలు, హీరోయిన్లు, కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. తాము ఏయే సినిమాలు చేస్తున్నాం, ఎప్పుడు షూటింగ్స్ అటెండ్ అవ్వాలి అనే విషయాలను గుర్తుపెట్టుకునే రిస్క్ తీసుకోరు. అందుకే మ్యానేజర్‌లను, అసిస్టెంట్‌లను హైర్ చేసుకుంటారు. హీరో, హీరోయిన్ల డేట్స్ కావాలన్నా, వారి షూటింగ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలన్నా ఈ మ్యానేజర్స్‌దే బాధ్యత. కానీ అలాంటి మ్యానేజర్ చేతిలోనే మోసపోయింది రష్మిక మందనా. తనపై కేసు కూడా ఫైల్ చేసింది.

Advertisement

కొంతమంది హీరోయిన్లు.. ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకోవాలంటే పెద్దగా సమయం పట్టదు. అలాంటి హీరోయిన్లలో రష్మిక మందనా కూడా ఒకరు. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే యూత్‌ఫుల్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక.. తెలుగులో కూడా ‘ఛలో’ అనే యూత్‌ఫుల్ సినిమాతోనే హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో రష్మికకు వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ఆపై తన పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ.. పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడానికి ఎక్కువకాలం పట్టలేదు.

హీరో, హీరోయిన్లు తమ మ్యానేజర్స్‌పై, అసిస్టెంట్స్‌పై పూర్తిగా ఆధారపడతారు. వారు చెప్పిందే నమ్ముతారు. అదే నమ్మకం రష్మికకు నష్టం తెచ్చిపెట్టింది. రష్మిక హీరోయిన్‌గా మారినప్పటి నుండి తన సినీ ప్రయాణంలో తోడుగా ఉన్న మ్యానేజర్.. రూ.80 లక్షలు మోసం చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి రష్మిక అసలు బయటపెట్టలేదు. తను ఈ విషయంపై ఎక్కువగా సీన్ క్రియేట్ చేయకుండా అతడిని ఉద్యోగం నుండి తొలగించి సైలెంట్ అయిపోయిందని సమాచారం.

Advertisement

రష్మిక.. తనను ఛీట్ చేసిన మ్యానేజర్‌పై కేసు కూడా పెట్టిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తున్నా.. ఈ విషయంపై తను స్పందించడానికి మాత్రం ముందుకు రాలేదు. ప్రస్తుతం రష్మిక.. తెలుగులో పుష్ప 2 చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్‌పై కూడా ఓ కన్నేసింది. అక్కడ రణబీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు తప్పా ఇంకేం సినిమాలను ఇంకా రష్మిక యాక్సెప్ట్ చేసినట్టుగా అధికారిక ప్రకటన రాలేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×