E-Paper
Advertisement

Rave Party: నటి హేమకు షాక్.. సస్పెండ్ చేసిన మా అసోసియేషన్

Rave Party: నటి హేమకు షాక్.. సస్పెండ్ చేసిన మా అసోసియేషన్
Advertisement

Rave Party: టాలీవుడ్ నటి హేమకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను ఆమెను సస్పెండ్ చేస్తూ ‘మా’ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మా అసోసియేషన్‌లో నటి హేమ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు గురువారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మా అసోసియేషన్ గ్రూప్‌లో సందేశం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సభ్యత్వం శాశ్వత రద్దుపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హేమకు జ్యుడీషియల్ కస్టడీ..

Advertisement

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో గత నెల 20న తెలుగు సినీ నటి హేమ దొరికిపోయిన విషయం తెలిసిందే. మొదటగా ఆమె తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్న హేమ.. హైదరాబాద్ ఫాంహౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో రూపంలో విడుదల చేసి పోలీసులతో పాటు అందరినీ తప్పు దారి పట్టించింది. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు అమెను అరెస్ట్ చేసింది. తర్వాత సీసీబీ పోలీసులు ఎదుట విచారణ చేశారు. అయితే డ్రగ్స్ కూడా సప్లై చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అనేకల్ నాల్గో అడిషనల్ సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టులో హేమను హాజరుపరిచారు. ఇందులో భాగంగా ఆమెకు జూన్ 14వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×