E-Paper
Advertisement

Ravi Babu: అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారు అని నాన్న అనడం తప్పు.. ఎట్టకేలకు నోరు విప్పిన రవిబాబు

Ravi Babu: అమ్మాయిలు పక్కలోకే పనికొస్తారు అని నాన్న అనడం తప్పు.. ఎట్టకేలకు నోరు విప్పిన  రవిబాబు
Advertisement

Ravi Babu: సీనియర్ నటుడు చలపతిరావు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన చలపతిరావు.. ఇండస్ట్రీలో జరిగిన ఒక పెద్ద వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చలపతి రావు అమ్మాయిలు పక్కలో పడుకోవడానికి పనికొస్తారు అని నోరు జారడం వలన ఆయన ఎన్నో విమర్శలకు గురికావాల్సి వచ్చింది.

ఇక ఈ వివాదం చలపతిరావు చనిపోయేవరకు కొనసాగింది. ఆయన చనిపోయేముందు ఈ మాటల వలన ఎవరైనా బాధపడితే క్షమించమని కూడా కోరారు. కానీ, నోరు జారాక విమర్శలు తప్పవు అన్న విషయం తెల్సిందే. ఇక ఈ వివాదంపై చలపతిరావు కుమారుడు, డైరెక్టర్ రవిబాబు ఇప్పటివరకు నోరు మెదిపింది లేదు. అప్పట్లో రవిబాబు మాట్లాడినట్లు వార్తలు వచ్చినా అవేమి నిజం కాదని ఆయన స్పష్టం చేశాడు.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నాన్న వివాదం గురించి నేనెప్పుడు మాట్లాడలేదు. కానీ, కొంతమంది నేను మాట్లాడినట్లు యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టారు. అయితే ఆ వివాదం జరిగినప్పుడు మాత్రం నాన్నతో మాట్లాడాను. మీరు అలా మాట్లాడడం తప్పు. మీరు మాట్లాడిన మాటలు ఇతరులను నొప్పించి ఉంటే సారీ చెప్పడం మీ బాధ్యత అని చెప్పాను. ఆ తరువాత ఆయన సారీ చెప్పారు.

మనమందరం ఎప్పుడో ఒకసారి నోరు జారేస్తాం.. లూజ్ గా మాటలు వదిలేస్తాం. కానీ, అది తెలుసుకోని సారీ చెప్పడం సంస్కారం. మా నాన్న మీడియా ముందు అలా నోరు జారడం ఆయన బ్యాడ్ లక్. సారీ చెప్పి ఆ టాపిక్ ను అక్కడితోఅయిపొయింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×