E-Paper
Advertisement

Raviteja: సర్జరీ తరువాత మొదటిసారి కనిపించిన రవితేజ..

Raviteja: సర్జరీ తరువాత మొదటిసారి కనిపించిన రవితేజ..
Advertisement

Raviteja: మాస్ మహారాజా రవితేజ షూటింగ్ సెట్ లో గాయపడిన విషయం తెల్సిందే.  ఈ మధ్యనే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత  ఈ హీరో చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్  ఉన్నాయి.

ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో పాల్గొన్నప్పుడే ఈ ప్రమాదం సంభవించింది. చిన్న గాయమే కదా  అని రవితేజ.. లైట్ తీసుకొని షూటింగ్ చేయడంతో అది కాస్తా  పెద్దగా మారింది. దీంతో డాక్టర్స్ .. రవితేజ కుడిచేతికి సర్జరీ నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. ఆ తరువాత  రవితేజ.. తాను బాగానే ఉన్నానని, కోలుకుంటున్నాని చెప్పడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న రవితేజ .. చాలా గ్యాప్ తరువాత అభిమానులను పలకరించాడు. డైరెక్టర్ బాబీ.. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందదర్భంగా.. రవితేజ ఇంటికి వెళ్లి, ఆయన బ్లెస్సింగ్స్  తీసుకున్నాడు. బాబీ కెరీర్ మొదలయ్యిందే రవితేజ సినిమాలతో. డాన్ శీను కు స్క్రీన్ ప్లే అందించడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బాబీ. ఆ తరువాత  రవితేజ నటించిన బలుపు సినిమాకు కథను అందించాడు.

ఇక బాబీ దర్శకత్వం వహించిన మొట్ట మొదటి సినిమా పవర్. ఈ సినిమా  ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా .. బాబీకి మంచి అవకాశాలనే అందించింది. ఇక ఆ తరువాత బాబీ వరుస సినిమాలతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇక తనకు లైఫ్ ని ఇచ్చిన రవితేజను.. బాబీ కలిసిన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కుడిచేతికి కట్టుతో రవితేజ కనిపించాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు రవన్న త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్ లో చేరాలని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×