BigTV English

Harishrao: హుటాహుటిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వెళ్లిన హరీశ్‌రావు.. ఇదేం పద్ధతంటూ..

Harishrao: హుటాహుటిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వెళ్లిన హరీశ్‌రావు.. ఇదేం పద్ధతంటూ..

Harishrao Serious on MLA Arekapudi Gandhi: కొండాపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేరుకుని ఆయనను పరామర్శించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను ఆయన పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు. ఇది రేవంత్ ప్రభుత్వ వైఫల్యం. మీరు ఒకటి చేస్తే.. మేం రెండు చేయగలుగుతాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాహుల్ రాజీనామా చేయించాలి. అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏసీపీ, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది? రేవంత్ బాధ్యత లేని మనిషి. కౌశిక్ రెడ్డిపై దాడి చేసినవారిని జైలుకు పంపేదాకా బీఆర్ఎస్ పోరాడుతుంది. మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.


Also Read: బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

‘ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి జరిగింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రతను కల్పించాలి. కాంగ్రెస్ పార్టీలో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. పైగా మాపైనే దాడులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా దాడి చేయడం అత్యంత దుర్మార్గం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేస్తున్నారు. ఈ విధానం సరికాదు. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ విధానాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పి తీరాలి. ఇటు దాడిని నిలువరించడంలో విఫలమైన పోలీస్ అధికారులపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×