E-Paper
Advertisement

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు
Advertisement

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. ? అని అభిమానులు  వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.  ఇక శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో  చరణ్ సినిమా అనౌన్స్ చేయగానే.. ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ వైపే చూసింది.  చరణ్ – శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్  పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా   నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది కచ్చితంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది అని అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసిన చరణ్.. ఇప్పుడు మరో గేమ్ మొదలుపెట్టాడు. గేమ్ ఛేంజర్ తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన  సినిమాతో జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న సిరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

ఉప్పెన సినిమా తరువాత బుచ్చిబాబు.. ఎన్టీఆర్ కోసం  ఎంతగానో ఎదురుచూశాడు. అతనికోసం ఒక కథను రెడీ చేసి  ఎప్పుడెప్పుడు వస్తాడా.. ? అని వేరే ఏ హీరోకు కథ చెప్పకుండా వెయిట్  చేశాడు. కానీ, తారక్ మాత్రం బుచ్చిబాబును పక్కన పెట్టి కొరటాల కు ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చిబాబు కథ నచ్చక తారక్ నో చెప్పాడని టాక్. అయితే తారక్ కు వినిపించిన కథనే చరణ్ కు వినిపించి  బుచ్చి.. RC16ను ఓకే  చేయించాడని అంటున్నారు. అందులో నిజం లేదని బుచ్చి చెప్పుకొస్తున్నారు. చరణ్ కోసం ఒక కొత్త  కథను రాసినట్లు, ఈ సినిమా కూడా రంగస్థలం టచ్ తో ఉండబోతుందని టాక్.

Advertisement

ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నాడు బుచ్చి. ఇంకోపక్క రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగాడు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ మోడ్ లో ఉన్న గ్లోబల్ స్టార్.. ఇప్పుడు RC16 లోకి మారుతున్నాడు.  ఈ సినిమాకు తగ్గట్లు తన బాడీని మార్చడానికి సిద్దమయ్యాడు.  తాజాగా  చరణ్.. ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. సెలబ్రిటీ ఫిట్ నెస్ కోచ్ శివోహం ఎదురుగా వస్తూ ఉంటే.. అతనికి ఎదురు వెళ్తూ చరణ్ కనిపించాడు.  బ్లాక్ కలర్ టీ షర్ట్,   షార్ట్స్ తో అదిరిపోయాడు. బెస్ట్ మోడ్ ఆన్ అనే క్యాప్షన్ పెట్టడంతో.. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా చరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×