BigTV English

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Simbaa: కొన్ని సినిమాలు థియేటర్ లో  ప్లాప్ అవుతాయి. కానీ, ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఏంటి నమ్మడం లేదా.. ? నిజమే అండీ. సాధారణంగా థియేటర్ లో  డబ్బులు పెట్టుకొని చూసిన సినిమా కొంతమందికి నచ్చకపోవచ్చు. లేదా.. ఆ సినిమా రిలీజ్ రోజునే మరో సినిమా రిలీజ్ అయ్యి ఉండొచ్చు. ఇలా   ఒక సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కథ  నచ్చితే థియేటర్ లో ఆదరించని ప్రేక్షకులు ఓటీటీలో బ్రహ్మరథం పడతారు. తాజాగా సింబా అలాంటి ప్రశంసలనే అందుకుంటుంది.


హాట్ బ్యూటీ అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో  నటించిన చిత్రం సింబా. మురళీ మనోహర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9 న రిలీజ్ అయ్యింది. అసలు ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యిందో  లేదో అన్న విషయం కూడా  చాలామందికి తెలియదు. ఇక ఈ మధ్యనే సింబా ఓటీటీ బాట పట్టింది.

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు


సెప్టెంబర్  4 నుంచి  అమెజాన్ ప్రైమ్, ఆహాలో సింబా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. చెట్లను పెంచి.. చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే.. ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తెరకెక్కించారు.  మొదటి రోజు నుంచి   సింబా మంచి విజయాన్ని అందుకుంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది.

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చూపించారు. డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ ‌కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి సినిమాలు చాలా రేర్ అని చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసే అనసూయ.. ఈ సినిమాలో  ప్రకృతిని  నాశనం చేసేవారిపై విరుచుకుపడిన తీరు నెక్స్ట్ లెవెల్. మరి ఇంకెందుకు ఆలస్యం.  సింబాపై మీరు కూడా  ఒక కన్నేసేయండి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×