E-Paper
Advertisement

Remo Dsouza : మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ పై చీటింగ్ ఆరోపణలు… కేసు నమోదు

Remo Dsouza : మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ పై చీటింగ్ ఆరోపణలు… కేసు నమోదు
Advertisement

Remo Dsouza : ఇటీవల కాలంలో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా పలువురు సెలబ్రిటీలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం రచ్చ రేపుతుండగా, తాజాగా బాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ (Remo D’Souza) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా చీటింగ్ కేసు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.

కొరియోగ్రాఫర్ పై చీటింగ్ కేసు…

Advertisement

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా (Remo D’Souza)పై తాజాగా చీటింగ్ కేసు నమోదయింది. ఓ యంగ్ డ్యాన్సర్ రెమోతో పాటు ఆయన సతీమణి లిజెల్లె, మరో ఐదుగురు వ్యక్తులు కలిసి తను మోసం చేసి, భారీగా డబ్బులు కాజేసారని పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు ప్రకారం రెమోతో పాటు మిగిలిన వ్యక్తులపై చీటింగ్ ఫోర్జరీ వంటి కేసులను నమోదు చేశారు పోలీసులు. గతంలో ఓ టెలివిజన్ కు సంబంధించిన కార్యక్రమంలో తన టీం పాల్గొని విన్ అయిందని, కానీ ప్రైజ్ మనీ 11 కోట్లని మాత్రం దానివల్ల 2018 నుంచి 2024 మధ్య రెమోతో పాటు మిగిలిన వారు కొట్టేశారని ఆ యంగ్ డాన్సర్ చేసిన ఆరోపణల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కొరియోగ్రాఫర్ రెమో 2009 నుంచి పలు డాన్స్ రియాల్టీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ‘రేస్ 3, బాజీరావు మస్తానీ, క్రిష్ 3, రోడ్, డార్లింగ్, క్యాష్ తదితర సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. అంతేకాదు ఏబిసిడి, స్ట్రీట్ డాన్సర్ 3, ఏబిసిడి 2 వంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

వరుసగా వివాదాలల్లో చిక్కుకుంటున్న ప్రముఖులు….

Advertisement

ఈ ఏడాది సినిమా పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు వరుసగా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కడంతో మొదలైంది దుమారం. దాంట్లో శేఖర్ భాషా చేసిన ఆరోపణలు, రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ లవర్ మధ్య గొడవ, ఆమె అతని ఇంటికి వెళ్ళి గొడవ చేయడం, అంతా అయ్యాక తనకు రాజ్ తరుణ్ వద్దు అంటూ రచ్చ రచ్చ చేసింది. వీళ్ళ వివాదం ఇలా చల్లబడిందో లేదో జానీ మాస్టర్ (Jani Master) కేసు తెరపైకి వచ్చింది. ఆయన ఇప్పుడు చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతలోనే హర్ష సాయి (Harsha Sai) మోసం చేశాడంటూ మరో బాధితురాలు కేసు నమోదు చేసింది. తాను తప్పు చేయలేదు అంటూనే తప్పించుకుని తిరుగుతున్నాడు హర్ష సాయి. ఇప్పటిదాకా అతన్ని పట్టుకోలేకపోయారు పోలీసులు. ఇక నాగార్జున – కొండా సురేఖా వివాదం ఇంకా కోర్టులోనే ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వివాదం రోజురోజుకూ పెద్దదవుతుంది. ఆయనకు హత్య బెదిరింపులు రావడం ఆందోళనకు గురి చేస్తుండగా పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు. ఇదిలా ఉండగా మనీలాండరింగ్ కేసులో తమన్నా విచారణ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ – సుఖేష్ చంద్రశేఖర్ వివాదం, తాజాగా కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రెమో డిసౌజా (Remo D’Souza) వివాదం… ఇలా చెప్పుకుంటూపోతే ఈ ఏడాది జరిగిన వివాదాల లిస్టు పెద్దదే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×