E-Paper
Advertisement

Rishab Shetty : ‘హనుమాన్’లో రిషబ్ శెట్టి మిస్ అయిన రోల్ ఏంటో తెలుసా..?

Rishab Shetty : ‘హనుమాన్’లో రిషబ్ శెట్టి మిస్ అయిన రోల్ ఏంటో తెలుసా..?
Advertisement
Today tollywood news

Rishab Shetty latest news(Today tollywood news):

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ‘హనుమాన్’ మూవీ భారీ ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల అతడు ఆ పాత్రలో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. మరి రిషబ్ నటించాల్సిన ఆ పాత్ర ఏంటో తెలుసుకుందాం..

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘హనుమాన్’. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా కలెక్షన్లలో తన హవా చూపిస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూళు చేసి అందరినీ అబ్బురపరచింది. అంతేకాదు.. ఈ సినిమా సీక్వెల్‌ను కూడా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ప్రకటించాడు. అంతకముందు ప్రమోషన్స్‌లో ప్రశాంత్ వర్మ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో తమిళ నటుడు సముద్రఖని నటించారు. అయితే ఈ పాత్రకు దర్శకుడు ప్రశాంత్ ముందుగా అనుకున్న వ్యక్తి సముద్రఖని కాదని.. కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి అని అన్నారు. అయితే అప్పటికే ఆ హీరో కాంతారా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడట. కాంతారా ఇంకా తెలుగులో రిలీజ్ కాకముందే విభీషణుడి పాత్రకి రిషబ్ అయితే కరెక్ట్‌గా ఉంటారని ఆయన దగ్గరకి వెళ్లారట.

అయితే ప్రస్తుతం తాను స్వయంగా హీరోగా, దర్శకత్వం వహిస్తున్న కాంతార సినిమాను పక్కన పెట్టి హనుమాన్ మూవీ చేయలేకపోతున్నానని రిషబ్ చాలా ఫీల్ అయ్యారని ప్రశాంత్ తెలిపారు. ఇక ఏది ఏమైనా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 10 సినిమాలలో కచ్చితంగా ఏదో ఒక సినిమాలో చేస్తానని రిషబ్ మాట ఇచ్చారని ప్రశాంత్ తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×