BigTV English

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్
Telugu breaking news

Manipur news today(Telugu breaking news):

భారత్ – మయన్మార్ సరిహద్దులో.. దక్షిణ మణిపుర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన సైనికుడొకరు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.


గతేడాది మణిపుర్ లో రెండు జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా.. ఎంతటి ఆందోళనలకు దారితీశాయో తెలిసిందే. మణిపుర్ అల్లర్లతో యావత్ దేశం అట్టుడికింది. తాజాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైన చురాచాంద్ పుర్ కావడం గమనార్హం. అతను కుకీ వర్గానికి చెందినవాడిగా గుర్తించారు.

కాల్పులకు గురైన బాధితులు మైతేయ్ వర్గానికి కానీ.. మణిపుర్ కు చెందినవారు కానీ కాదని సమాచారం. ఈ కాల్పులపై ఎలాంటి వదంతులు లేకుండా ఉండేందుకు అస్సాం రైఫిల్స్ ఈ ఘటన వివరాలను వెల్లడించింది.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×