BigTV English

Roshann: శ్రీకాంత్ కొడుకు రోషిన్‌కి హిట్ వ‌చ్చేనా?

Roshann: శ్రీకాంత్ కొడుకు రోషిన్‌కి హిట్ వ‌చ్చేనా?

Roshann: శ్రీకాంత్ కొడుకు రోషిన్‌కి హిట్ వ‌చ్చేనా?


టాలీవుడ్‌లో వార‌సుల ఎంట్రీ ఎప్పుడో షురూ అయ్యింది. అలాంటి వారిలో రోష‌న్ మేక‌పాటి ఒక‌డు. త‌ను సీనియ‌ర్ స్టార్ శ్రీకాంత్ త‌న‌యుడు. బాల న‌టుడిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో న‌టించిన రోష‌న్‌, త‌ర్వాత నిర్మ‌లా కాన్వెంట్ మూవీతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తర్వాత గ్యాప్ తీసుకున్న రోషన్ పాండమిక్ లాక్డౌన్ తర్వాత రాఘవేంద్రరావు శిష్యురాలు ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘పెళ్లి సందD’ సినిమాతో ఫుల్ ప్లెజ్డ్ కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరోయిన్ శ్రీలీల‌కు మంచి గుర్తింపు వ‌చ్చిందే కానీ.. రోష‌న్‌కి కాదు.

అయితే రోష‌న్ ఏం మాత్రం టెన్ష‌న్ ప‌డ‌టం లేదు. చాలా కూల్‌గా సినిమాల‌ను పిక్ చేసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు క్రేజీ సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ క‌లిసి నిర్మిస్తున్న సినిమాలో రోష‌న్ హీరోగా న‌టిస్తున్నారు. చాంపియ‌న్ పేరుతో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. జాతీయ అవార్డ్ విజేత ప్ర‌దీప్ అద్వైతం ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీతో హిట్ కొట్టి హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని రోషన్ వెయిట్ చేస్తున్నాడు.


వైజ‌యంతీ, స్వ‌న్న సినిమాస్ బ్యాన‌ర్స్ మ‌హాన‌టి, సీతారామం వంటి క్రేజీ మూవీస్‌తో భారీ హిట్స్‌ను సాధించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కె మూవీ కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ చూడ‌ని రోష‌న్‌కు ఈ సంస్థ‌లు హిట్‌ను అందిస్తాయో లేదో చూడాలి. హీరో శ్రీకాంత్ సైతం కొడుక్కి మంచి హిట్ దొర‌కాల‌ని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మ‌రి ఆయ‌న నిరీక్ష‌ణకు ఎండ్ కార్డ్ ప‌డుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

 దీపికా మెడపై 82°E టాటూ.. మీనింగ్ ఏంటంటే…

for more updates follow this link:-bigtv

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×