E-Paper
Advertisement

RRR: ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రభంజనం.. ఏకంగా ఐదు అంతర్జాతీయ అవార్డులు

RRR: ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రభంజనం.. ఏకంగా ఐదు అంతర్జాతీయ అవార్డులు
Advertisement

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ వేదికలపై ప్రభంజనం సృష్టిస్తోంది. హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ మూవీ తాజాగా మరో ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్‌లో ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు), బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, హెచ్‌సీఏ స్పాట్‌లైట్ విభాగాల్లో అవార్డులను అందుకుంది. హాలీవుడ్ మూవీస్ ది వుమెన్ కింగ్, ది బ్యాట్ మ్యాన్, బ్లాక్ పాంథర్ వంటి భారీ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసింది.

Advertisement

ఇక అవార్డులు రావడం పట్ల రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవమని అన్నారు. తమ ట్యాలెంట్‌ను గుర్తించి హెచ్‌సీఏకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమాలో రెండు, మూడు షాట్స్‌లో మాత్రమే డూప్స్‌ని ఉపయోగించామని..మిగతా షాట్స్ అన్నీ ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్వయంగా చేశారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక అవార్డులు అందించే బృందాలకు.. అవార్డుల జాబితాలో స్టంట్ కొరియోగ్రాఫర్ క్యాటగిరీని చేర్చాలని విన్నవించుకున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×