E-Paper
Advertisement

RRR: ఎల్లలు దాటిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్రేజ్.. అంతర్జాతీయ అవార్డుకు నామినేట్

RRR: ఎల్లలు దాటిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్రేజ్.. అంతర్జాతీయ అవార్డుకు నామినేట్
Advertisement

RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల క్రేజ్ ఎల్లలు దాటింది. సినిమా రిలీజ్ అయి దాదాపు ఏడాది కావస్తున్నా దేశవిదేశాల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీపై హాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ప్రశంసలు కురిపించారు.

ఈ మూవీతో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరిలో ఈ ఇద్దరు హీరోలు నామినేట్ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ది క్రిటిక్స్ ఛాయిస్ అసోసియేషన్ ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ పేరుతో పురాస్కారాలను అందజేస్తుంది. మార్చి 16న విజేతలను ప్రకటించనున్నారు.

Advertisement

ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు ఆర్ఆర్ఆర్ మూవీ ఎంపికైంది. అలాగే ఈ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్‌కు నామినేట్ కావడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.

ఇక దీనిపై రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ విభాగంలో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ లాంటి దిగ్గజ నటుల మధ్య నా పేరు. నా సోదరుడు ఎన్టీఆర్ పేరు కలిసి చూడడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×