BigTV English
Advertisement

Ruhani Sharma: రుహనీ శర్మ బోల్డ్ వీడియో లీక్.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

Ruhani Sharma: రుహనీ శర్మ బోల్డ్ వీడియో లీక్.. ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్

Ruhani Sharma: ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న  పేరు రుహనీ శర్మ. చిలసౌ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన బ్యూటీ రుహనీ శర్మ. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. ఎంతో పద్దతిగా కనిపించి తెలుగు కుర్రకారు గుండెల్లో  తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత రుహనీ శర్మ కు వరుస అవకాశాలు వచ్చాయి కానీ, ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు.


ఇక లేడీ ఓరియెంటెడ్  సినిమాగా తెరకెక్కిన షీ కూడా ఆమెకి విజయాన్ని అందించలేదు.  కానీ, ఒక బాలీవుడ్ సినిమా మాత్రం రుహనీకి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. అదే ఆగ్రా మూవీ. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి రుహనీ బోల్డ్ సీన్స్ వీడియో లీక్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. హీరోతో ఆమె ఇంటిమేటెడ్ సీన్స్ మితిమీరి ఉండడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం అమ్మడిపైనే  పడిపోయింది.

ఎంత పద్దతిగా  ఉండేది.. పోర్న్ స్టార్ లా మారింది అని, ఇలాంటివారు అవకాశాల కోసం ఎన్నైనా చేస్తారని  ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా  ఈ లీక్డ్ వీడియోపై రుహనీ స్పందించింది.  ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమాలోని సీన్ ను ఇలా లీక్ చేసి వారి కష్టాన్ని దోచుకోవడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఓపెన్ లెటర్ రాసుకొచ్చింది.


”  ఆగ్రా సినిమాలో నేను నటించిన సన్నివేశాలు లీక్ అయినప్పటి నుంచి చాలా బాధగా ఉన్నాను. నా బాధను వర్ణించడానికి  మాటలు కూడా రావడం లేదు. మా కష్టాన్ని, అంకితభావాన్ని, ఇష్టాలను మర్చిపోయి కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి చిత్రాలను రూపొందించడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఒక ఆర్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించడం అంటే మాములు విషయం కాదు.  ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. అలాంటి సినిమాలను మీ ముందుకు తీసుకురావడానికి రక్తాన్ని చెమటగా మార్చాలి.

మా కన్నీళ్లను అర్థం చేసుకోకుండా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా మొత్తంలో కొన్ని సీన్స్  మాత్రమే చూసి సినిమాపై ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. అలాగే ఆ సీన్స్ లో నటించినందుకు నన్ను జడ్జ్ చేయకండి. ఈ సినిమాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శించారు. అది సినిమాకు దక్కిన గౌరవం.

అలాగే ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్టులో పనిచేసినందుకు నాకు గర్వంగా ఉంది.  కళ అనేది ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. మా శ్రమను వృథా చేయకండి. సినిమా గొప్పతనాన్ని చూడండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×