BigTV English

Heavy Rains: అతలాకుతలమవుతున్న బంగ్లా.. మరింతగా దిగజారే అవకాశం

Heavy Rains: అతలాకుతలమవుతున్న బంగ్లా.. మరింతగా దిగజారే అవకాశం

Heavy Rains and floods in Bangladesh: రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ దేశంలో పరిస్థితులు తీవ్ర తరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశంపై మరో పిడుగు పడింది. ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైతున్నది. భారీ వరదలు పోటెత్తుతుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 50 లక్షల మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోగా, దాదాపు 15 మంది మృతిచెందినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. భారీ వర్షాలకు సుమారు 5 నదుల కట్టలు తెగి పొంగిపొర్లుతున్నాయి. దీని వల్ల 11 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెల్లడించారు.


గత మూడు దశాబ్దాల్లో దేశం చూసిన అత్యంత దారుణమైన వరదలు ఇవేనని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారన్నారు. వర్షాలు కొనసాగుతుండడం వల్ల పరిస్థితులు మరింతగా దిగజారే అవకాశం ఉందంటూ స్థానిక వాతావరణ శాఖ పేర్కొన్నది.

Also Read: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు


బంగ్లా ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేసుంది. వరద బాధితుల కోసం ఆహారం, అత్యవసరమైన వైద్య సేవలు అందించడానికి 3,176 షెల్టర్లను, 639 వైద్య బృందాలను నియమించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. అయితే, వీధుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని, అత్యవసర వస్తువుల రవాణా క్లిష్టతరంగా మారిందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. దేశంలో ఇటీవలే రాజకీయ నిరసనలు వెల్లువెత్తాయి దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టిన విషయం విధితమే.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×