E-Paper
Advertisement

Project-K new update : రూమర్స్ కాదు నిజమే.. ‘ప్రాజెక్ట్ కె’ కొత్త అప్డేట్..

Project-K new update : రూమర్స్ కాదు నిజమే.. ‘ప్రాజెక్ట్ కె’ కొత్త అప్డేట్..
Advertisement
Project-K new update

Project-K new update : పాన్ ఇండియా స్టార్‌గా మారడం కంటే అలా మారిన తర్వాత పెరిగిన ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం కష్టమని కొందరు హీరోలను చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దర్శకుడి మీద నమ్మకంతో సినిమాలు ఒప్పుకున్న తర్వాత ఔట్‌పుట్ బాలేకపోతే.. ఆ ఫ్లాప్‌కు క్రిడెట్ మొత్తం హీరోపైనే పడుతుంది. అది ఒక్కొక్కసారి హీరో క్రేజ్‌నే దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి అలాగే ఉంది. కానీ తన తరువాత చిత్రాలపై మాత్రం రోజురోజుకీ అంచనాలు పెరిగిపోయేలా చేస్తున్నారు మేకర్స్.

Advertisement

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ స్టార్‌డమ్ ఒక్కసారిగా ఏ రేంజ్‌కు వెళ్లిందో చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రభాస్‌ను గుర్తుపట్టే స్థాయికి ఎదిగాడు. దీంతో తన ఫ్యాన్‌బేస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఎందుకో బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఏవీ ఫ్యాన్స్‌ను తృప్తిపరచలేకపోయాయి. తాజాగా విడుదల అయిన ‘ఆదిపురుష్’ కూడా నెగిటివ్ రివ్యూలతో నిండిపోయింది. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్స్‌పైనే ఉన్నాయి.

ప్రస్తుతం ప్రభాస్.. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’పైనే ఫ్యాన్స్ పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. ఇక వారి అంచనాలకు తగినట్టుగా నాగ్ అశ్విన్.. కుదిరినప్పుడల్లా మంచి అప్డేట్‌తో ముందుకొస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఎందరో క్రేజీ స్టార్లను ప్రాజెక్ట్ కె కోసం సెలక్ట్ చేసిన నాగ్ అశ్విన్.. తాజాగా మరో కొత్త అప్డేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Advertisement

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. ప్రాజెక్ట్ కె‌లో నటించే అవకాశాలు ఉన్నాయంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు మూవీ టీమ్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. కమల్ హాసన్.. ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో జాయిన్ అయ్యాడంటూ అప్డేట్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ సంతోషంగా అవధులు లేవు. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ లాంటి స్టార్లు ప్రాజెక్ట్ కెలో భాగమవ్వగా అందులో కమల్ హాసన్ కూడా ఉండడం ఫ్యాన్స్ అంచనాలను మరింతగా పెంచేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×