BigTV English

New laws on car Sales : కార్ల అమ్మకం విషయంలో కొత్త చట్టాలు..

New laws on car Sales : కార్ల అమ్మకం విషయంలో కొత్త చట్టాలు..
New laws on car Sales


New laws on car Sales : ఏ వస్తువు అయినా అమ్మకం విషయంలో మిడిల్ మ్యాన్ అనేవాళ్లు ఉంటే.. ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రైజ్ మరింతగా పెరుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని రంగాల్లో మిడిల్ మ్యాన్ అనేవారు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆటోమొబైల్ రంగాల్లో కూడా ఇలాంటి పద్ధతి ఆచరణలో ఉంది. కానీ ఫ్లోరిడాలో మాత్రం ఇకపై ఇలా జరగకూడదని ప్రభుత్వం రూల్ పాస్ చేసింది.

సౌతర్న్ యూఎస్ స్టేట్‌లో కార్ల అమ్మకాల విషయంలో ఫ్లోరిడా ప్రభుత్వం నిరాశగా ఉంది. అందుకే హెచ్‌బీ 637 అనే చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వర్చువల్‌గా కానీ, నేరుగా కానీ కారు తయారీ సంస్థలు.. కస్టమర్లకు నేరుగా అమ్మకాలు చేయకూడదు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఫోర్డ్ లాంటి కంపెనీలు కూడా ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్ల సాయం లేకుండా కార్లను నేరుగా కస్టమర్లకు అమ్ముతున్నాయి. ఇకపై అలా జరగకూడదని కార్లను ముందుగా ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లకే అందించాలని చట్టం చెప్తోంది.


జులై 1 నుండి ఈ చట్టం అమలులోకి రానుంది. ఆటోమొబైల్ రంగాన్ని లాభాల్లోకి తీసుకెళ్లి, ఆర్థికంగా స్థిరపడేలా చేయడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఫ్లోరిడా ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ రూల్ అనేది అన్ని కంపెనీలకు, అన్ని రకాల కార్లకు వర్తించదని అంటోంది. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో మిడిల్ మెన్ లేకుండానే కంపెనీలు నేరుగా కస్టమర్లకు అమ్మవచ్చనే సౌకర్యాన్ని కల్పించింది.

టెస్లా, రివియన్, పోల్‌స్టార్, ల్యూసిడ్ లాంటి కంపెనీలకు ఈ చట్టం వర్తించదని తెలుస్తోంది. కారు కంపెనీలు విచ్చలవిడిగా రేట్లను ఫిక్స్ చేస్తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇలాంటి చట్టం ఒకటి అమలులోకి వస్తే.. ఆటోమొబైల్ రంగంలో ఆర్థిక వ్యవహారాలను ఎక్కువగా గమనించవచ్చని, అటు కస్టమర్లకు ఇటు కంపెనీలకు నష్టం రాకుండా చూసుకోవచ్చని ఫ్లోరిడా ప్రభుత్వం ఆశిస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×