E-Paper
Advertisement

Saaree Teaser : ఆర్జీవీ ‘శారీ’ టీజర్.. పేరుకే చీర, అందాలు ఆరబోతే ఎక్కువ.. మరో అడల్ట్ మూవీ అవుతుందా?

Saaree Teaser : ఆర్జీవీ ‘శారీ’ టీజర్.. పేరుకే చీర, అందాలు ఆరబోతే ఎక్కువ.. మరో అడల్ట్ మూవీ అవుతుందా?
Advertisement

RGV – Saaree Teaser : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో ఎన్నో సినిమాలను తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది ప్రముఖుల నుంచి సైతం ప్రసంశలు అందుకున్నాడు. కానీ ఇప్పుడు అతడి రూటే సపరేటు. భూమిపై ఉండే వారంతా ఒకవైపు.. ఆయనొక్కడు ఒకవైపు అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఎక్కువగా కాంట్రవర్సీల్లో చిక్కుకుంటుంటాడు. రాజకీయ నాయకులపై, సినీ స్టార్లపై కామెంట్లు చేస్తూ వివాదాల్లో ఇరుక్కుంటుంటాడు.

అలాగే మరోవైపు సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. మొత్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సారి దర్శకునిగా కాకుండా నిర్మాణం బాధ్యతలు తీసుకున్నాడు. ఆర్జీవీ ఆర్‌వి నిర్మాణంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘శారీ’. ఈ సినిమాను తెరకెక్కించే ముందు ఆర్జీవి ఇందులో హీరోయిన్‌ కోసం తెగ వెతికేశాడు.

Advertisement

ఆఖరికి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ను ఓ అందమైన అమ్మాయికి ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది శ్రీలక్ష్మి సతీస్ (ఆరాధ్య దేవి). పలు వీడియోలు, ఫొటోలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే ఓ రోజు ఆ అమ్మాయి వీడియో ఆర్జీవి కంట పడింది. దీంతో ఆ అమ్మాయి అడ్రస్ వెతకి హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు. మొదటిగా ఆరాధ్య దేవితో హాట్ హాట్ ఫొటో షూట్ చేసి ఆమెను మరింత పాపులర్ చేశాడు.

Also Read: మోహన్ బాబుకు మనోజ్ ఝలక్.. స్టూడెంట్స్‌కే నా సపోర్ట్..

Advertisement

ఇక ఆర్జీవి చెప్పినట్టుగానే ఆరాధ్యతో సినిమా తీశాడు. ‘శారీ’ మూవీలో ఆమెను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశాడు. ఈ సినిమాకు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి. ఇక ఇప్పుడు మరో అప్డేట్‌తో మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ బోల్డ్ లుక్ సీన్లతో ఆకట్టుకుంటోంది. ఆర్జీవి మూవీ అంటే అలానే ఉంటుంది అని కొందరు అంటున్నారు.

ఇక టీజర్ బట్టి చూస్తే.. ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్లాడినట్లు అర్థం అవుతుంది. మొదటిగా ఒక వ్యక్తి ఆరాధ్యను ఇష్టపడతాడు. ఆమెనే ఫాలో అవుతాడు. ఆమె ఫొటోలు తీసి తరచూ తన ఇంట్లో చూసుకుంటాడు. రోజు రోజుకూ ఇష్టం పెంచుకుంటాడు. తరచూ తనతోనే కళలు కంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆమెకు ఫొటోలు చూపించి మరింత దగ్గరవుతాడు. అలా ఇద్దరూ కలిసి ఒక స్టూడియో కూడా పెడతారు. ఆ స్టూడియోలో ఆరాధ్యతో ఫోటో షూట్ చేస్తాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చూపించారు.

తడిసిన అందాలతో ముద్దులు పెట్టుకుంటూ చిత్రీకరించిన సన్నివేశాలు హైప్ పెంచేశాయి. ఆ తర్వాత ఆరాధ్య వేరొకరితో కనిపిస్తుంది. దీంతో కెమెరామ్యాన్‌గా ఉన్న అతడు కోపం పెంచుకుంటాడు. అదే క్రమంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. పోలీసులతో దెబ్బలు తింటాడు. ఆమెను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. ఇలా మొత్తంగా టీజర్ ఫుల్ బోల్డ్ సీన్లతో అరాచకం అనిపించింది. ఇక అక్కడక్కడ వచ్చే సీన్లలో ఆరాధ్య బోల్డ్ ఎక్స్‌ప్రెసన్ సన్నివేశాలు అయ్యబాబోయ్ అనిపించేలా ఉన్నాయి. ఎద అందలతో టీజర్ హీట్ పెంచేశారు మేకర్స్.

షారుఖ్ ఖాన్ ‘డర్’ మూవీ

అయితే ఈ ‘శారీ’ సినిమా టీజర్ చూసిన వారికి షారుఖ్ ఖాన్ ‘డర్’ మూవీ గుర్తుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ సినిమాలో కూడా అచ్చం ఇదే తరహా సన్నివేశాలు ఉంటాయి. ఇక శారీ మూవీలో ‘డర్’ మూవీలోని సన్ని డియోల్ క్యారెక్టర్‌ను డమ్మీ చేసినట్లు కనిపిస్తుంది. దీని బట్టి చూస్తే ఈ శారీ మూవీ షారుఖ్ ఖాన్ ‘డర్’ మూవీకి కాపీ పేస్ట్‌లా అనిపిస్తుందని కొందరు అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×