Manchu Manoj Reaction On Mohan Babu University Issue: గత మూడు రోజులు నుంచి మోహన్ బాబు యూనివర్శిటీపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే విద్యార్ధి సంఘాలు, వారి తల్లి దండ్రులు అక్కడ ధర్నాలు చేస్తున్నారు. సాధారణంగా యూనివర్శిటీలో ఎవరైన ఒకరు సీటు కోసం వెళ్తే.. ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించినటువంటి కోటా కింద.. దాదాపు రెండు లక్షలు ఉంటుంది. కానీ మోహన్ బాబు యూనివర్శిటీలో మాత్రం దాదాపు నాలుగు లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో యూనివర్శిటీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏఐసీటీసీఈకి కూడా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు ఎంబీయూపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టాయి. అయితే ఈ వివాదాలాపై మోహన్ బాబు యునివర్శిటీ యాజమాన్యం బహిర్గతంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఛాన్సలర్ మోహన్ బాబు కూడా ఈ వివాదాలపై స్పందిచలేదు. అనూహ్యంగా మంచు మనోజ్ దీనిపై స్పందించారు.
Also Read: జర్సీ భామకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు లేవట.. ఆ విషయంలో తాను లక్కీ అంటోంది
మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్ లో ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారంటూ.. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో మంచు మనోజ్ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ఆందోళనల గురించి తెలుసుకున్నానని, అవి తనను బాధించాయన్నారు. తమ తండ్రి, ఛాన్సలర్ మోహన్ బాబు.. విద్యార్థులు, రాయలసీమ సమాజ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తారన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్కి తన పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపారు.
యూనివర్సిటీలో పరిస్థితిని అంచనా వేసేందుకు.. తాను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని సంప్రదించానని.. ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే [email protected]కి ఈ మెయిల్ చేయాలని.. వాటిని వ్యక్తిగతంగా మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇచ్చినా.. వర్సిటీలోని మేనేజ్మెంట్ అధనంగా 22వేలు వసూలు చేస్తుందని ఆరోపించారు ఏఐఎస్ఎఫ్ నాయకులు.
Share