E-Paper
Advertisement

Sai Kumar: ఆయన వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాయికుమార్ కూతురు..!

Sai Kumar: ఆయన వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సాయికుమార్ కూతురు..!
Advertisement

Sai Kumar.. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తల్లిదండ్రుల గుర్తింపును ఉపయోగించుకుని ఎదగాలని ప్రయత్నం చేస్తే.. మరికొంతమంది బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంతంగా ఎదగాలని ఆలోచించేవారు కూడా వుంటారు. అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ స్టార్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సొంతం చేసుకున్న సాయి కుమార్ (Sai Kumar)కూతురు కూడా ఒకరు అని చెప్పవచ్చు. సాయికుమార్ కూతురు అని చెప్పడం కంటే ట్విన్ సిటీస్ లో డాక్టర్ జో అంటే పరిచయం లేని వారు ఎవరు ఉండరు . సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జో అలియాస్ జ్యోతిర్మయి (jyothirmayi) చరిష్ హాస్పిటల్ ఫౌండర్ గా మంచి పేరు సొంతం చేసుకుంది.

తండ్రి ఇమేజ్ ఉపయోగించుకోవడం ఇష్టం లేదు..

Advertisement

నిజానికి తండ్రి ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ అయినా తన తండ్రి ఇమేజ్ ను ఆమె ఏ రోజు ఉపయోగించుకోలేదు. సొంతంగా నిలబడాలని తనకంటూ ఒక పేరు గుర్తింపు వచ్చిన తర్వాతే తాను సాయికుమార్ కూతురుగా అందరికీ పరిచయమైతే బాగుంటుంది అంటూ కోరుకునే వ్యక్తిత్వం ఆమెది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిర్మయి తన కుటుంబం ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోడ్డున పడింది అంటూ విస్తుపోయే నిజాలు చెప్పుకొచ్చింది. మరి జ్యోతిర్మయి చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం..

Advertisement

సాయికుమార్ , ఆయన వారసుడు ఆది గురించి చాలామందికి తెలుసు కానీ వారి ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. అటు సినిమా ఈవెంట్లలో మినహా ఎక్కడ వివాదాలలో కూడా వీరి పేరు వినిపించదు. నిజాయితీగా తమ పని తాము చేసుకుంటూ ఇండస్ట్రీలో ఒక పేరు సొంతం చేసుకున్న సాయికుమార్ ఒకానొక సమయంలో తన తమ్ముడు కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాలపై సాయికుమార్ కూతురు జ్యోతిర్మయి మాట్లాడుతూ.. నేను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో మా బాబాయ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయాము.. ఒకానొక సమయంలో మా బాబాయ్ ఈశ్వర్ అల్లా అనే సినిమా తీశారు. సొంత బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్క సినిమాతో ఫైనాన్షియల్ గా మా కుటుంబం రోడ్డుకి ఎక్కింది.

మా అమ్మ ఫైటర్ గా మారింది..

అయితే ఆ సమయంలో మా అమ్మే ఫైటర్ గా మారి ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేసింది. దాదాపు రెండు మూడు సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అటు డిస్టర్బ్యూటర్స్ తో ఇటు ఫైనాన్షియర్ తో అమ్మ మాట్లాడిన తీరుకి వారు అమ్మను నమ్మి , మాకు కాస్త టైం ఇచ్చారు. ఇక ఆ అప్పులు తీర్చడానికి నాన్న ఎంతో కష్టపడ్డారు.. నాన్న అక్కడ నటించడం, ఆ డబ్బు తీసుకొచ్చి అప్పులు తీర్చడం ఇలా దాదాపు మూడు సంవత్సరాల కష్టం తర్వాత మళ్లీ మేము బయటపడ్డాము. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు మాకే రోజు కూడా మా తల్లిదండ్రులు తెలియనివ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. జ్యోతిర్మయి. ప్రస్తుతం సాయికుమార్ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×