BigTV English

Samantha : వాళ్ళ వల్లే ఈ స్థితిలో ఉన్నా… మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్

Samantha : వాళ్ళ వల్లే ఈ స్థితిలో ఉన్నా… మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్

Samantha : అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సమంత మరోసారి ఆమె కామెంట్స్ పై స్పందించారు.


వాళ్ల వల్లే ఈ స్థితిలో ఉన్నాను…

తాజాగా సమంత హీరోయిన్ గా నటించిన యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్ : హనీ బన్నీ’ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో సమంత కొండ సురేఖ కామెంట్స్ పై ఇన్ డైరెక్ట్ గా స్పందించారు. ఈ విషయం గురించి ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ “నేను ఈరోజు ఇలాంటి స్థాయిలో ఉండడానికి, ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యమైన కారణం అభిమానులు. వాళ్ళతో పాటే ఇండస్ట్రీ సపోర్టు కూడా. ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రేమ, నాపై వాళ్ళకు ఉన్న నమ్మకం నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే కష్టాలను ఎదుర్కోవడంలో వారి సపోర్ట్ నాకు బాగా హెల్ప్ అయ్యింది. వాళ్లు నాకు సపోర్ట్ చేయకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించడానికి చాలా టైం పెట్టేది. అంతేకాకుండా అదే జరిగితే నేను వాటిని వదులుకోవాలని అనుకునేదాన్నేమో. గతంలోనైనా, లేదా ఇటీవల జరిగిన విషయాలపైన అయినా నా చుట్టూ ఉన్నవారి నమ్మకంతోనే నేను వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలిగాను” అని సమంత చెప్పుకొచ్చారు. కాగా మరోవైపు కొండ సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. విచారణ ఆలస్యం కావడంపై అక్కినేని అభిమానులు నిరసన వ్యక్తం ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నాగ మాట్లాడుతూ ‘సమంతకు సారీ చెప్తే సరిపోతుందా? మరి నా ఫ్యామిలీ సంగతి ఏంటి?’ అంటూ కొండా సురేఖా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ పరువు, ప్రతిష్టాలకు భంగం కలిగించేలా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగ్ కేసు వేశారు.


వివాదంతో మరింత హైలైట్ అయిన సమంత

గత కొంతకాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత దాన్నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే శాకుంతలం, ఖుషీ సినిమాల తర్వాత ఆమె మరో సినిమాను చేయలేదు. ఇప్పుడు గతంలో ప్రారంభించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ను పూర్తి చేసి, అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో కూడా పాల్గొంటుంది.. అయితే ఈ క్రమంలోనే ఆమెపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ వివాదం సమంతకు మరింత బూస్ట్ ఇచ్చినట్టుగా అయింది. కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీకైతే క్షమాపణలు చెప్పలేదు కానీ సమంతకు మాత్రం క్షమాపణలు చెప్పి వివాదాన్ని కొంతవరకు సద్దుమణిగేలా చేసింది. ఈ వివాదంపై సమంతపై కొంతవరకు సింపతిని క్రియేట్ చేసింది. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన సమంతా ‘సిటాడెల్ : హనీ బన్నీ’ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తన సొంత బ్యానర్ పై “మా ఇంటి బంగారం” అనే సినిమాను ప్రకటించింది కానీ, ఈ సినిమాపై మరో అప్డేట్ రాలేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×