EPAPER

Sai Pallavi: చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి డ్యాన్స్.. అదరగొట్టేసింది

Sai Pallavi: చెల్లి పెళ్ళిలో సాయి పల్లవి డ్యాన్స్.. అదరగొట్టేసింది

Sai Pallavi:  స్టార్ హీరోయిన్  సాయి పల్లవి  ఇంట  సంబురాలు అంబురాలను అంటాయి. సాయి పల్లవి చెల్లి పూజా  కన్నన్ వివాహం ఘనంగా  జరిగింది. రెండు నెలల క్రితం పూజా నిశ్చితార్థం తన చిన్ననాటి స్నేహితుడు అయిన వినీత్ తో గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే.


చెల్లిని రెడీ చేయడానికి సాయి పల్లవి కష్టపడడం, పూజా తన అక్కను పూర్తిపేరుతో పిలుస్తూ.. త్వరగా  రెడీ చేయమని అడగడం, కుటుంబం మొత్తం డ్యాన్స్ చేయడం  ఇలాంటి వీడియోలు  ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.

ఇక ఈరోజు పూజా, వినీత్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. కోటగిరిలోని పడుకర్ పద్దతిలో ఈ జంట ఒక్కటయ్యారు. చెల్లి పెళ్లిని సాయి పల్లవి దగ్గర ఉండి జరిపించింది. సంప్రదాయ దుస్తుల్లో సాయి పల్లవి మెరిసిపోయింది.  ఇక ఈ పెళ్లి సంగీత్ లో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చేసిన  డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.  సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. మరాఠి సాంగ్ అప్సరా ఆలీ సాంగ్ కు ఈ అక్కాచెల్లెళ్లు  అద్భుతమైన  డ్యాన్స్ చేసి మెప్పించారు. ముఖ్యంగా బ్లూ కలర్ డ్రెస్ లో సాయి పల్లవి డ్యాన్స్ మూవ్స్  కు ఫ్యాన్స్ ఫిదా  అవుతున్నారు. ఇక పెళ్ళిలో చీరకట్టులో  సాయి పల్లవి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది.

అంతేకాకుండా పెళ్లి తరువాత వారి సాంప్రదాయ నృత్యంలో కూడా  సాయి పల్లవి  మెప్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికొస్తే.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో టాండేల్, తమిళ్ లో అమరన్, హిందీలో రామాయణం సినిమాల్లో నటిస్తుంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Deepika padukone: అదంతా ఫేక్.. నా కూతురు ఫొటోలు కావు.. దీపిక పదుకునె వివరణ

Niharika : నిహారికకు బాబాయ్ ప్రశంసలు..అందుకేనా?

Janhvi Kapoor: దేవరలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఆ స్టార్ నటి అని మీకు తెలుసా.. ?

Jabardasth: జబర్దస్త్ కు కొత్త జడ్జ్.. కృష్ణ భగవాన్ కు ఏమైంది.. ?

Koratala Shiva: దేవర ప్లాప్ అయితే కొరటాల మామ పరిస్థితి ఏంటో.. ?

Devara Trailer Review: ఆచార్య 2.. దేవర స్టోరీ ఇదే..?

Manju Warrier: 46 ఏళ్ళ వయస్సులో ఆ ఊపు.. హైప్.. పిచ్చెక్కించేసిందిగా

×