EPAPER

The Goat: ది గోట్.. అప్పుడే ఓటీటీ డేట్ ఫిక్స్..?

The Goat: ది గోట్.. అప్పుడే ఓటీటీ  డేట్ ఫిక్స్..?

The Goat:  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్  చివరి చిత్రం ది గోట్.. ఎన్నో అంచనాల నడుమ   ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్  టాక్ ను అందుకుంది. వెంకట్ ప్రభు  దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన స్నేహ, మీనాక్షీ చౌదరి  నటించారు.


ఇక ఈ సినిమా  తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. సినిమా అంతా రొటీన్ గా అనిపించడంతో తెలుగు ఆడియెన్స్   ది గోట్ సినిమా చూడడానికి అంతగా ఆసక్తి  కనపరచడం లేదు. ఈ మధ్యకాలంలో  మౌత్ టాక్ అనేది సినిమాకు ప్లస్ గా  మారింది. మొదటి షో అవ్వగానే చూసినవారు  చెప్పే మౌత్ టాక్ ను బట్టే  కలక్షన్స్  అంచనా  వేస్తున్నారు.

ఇంకొంతమంది   ఆ మౌత్ టాక్ ను బట్టే.. సినిమాను థియేటర్ లో చూడాలా.. ? ఓటీటీలో చూడాలా.. ? అని తేల్చుకుంటున్నారు. ఇక ది గోట్ మూవీ  ఓటీటీ  గురించి కూడా  సోషల్ మీడియాలో టాక్  నడుస్తుంది.  ఈ సినిమా ఓటీటీ  హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది.


అందుతున్న సమాచారం ప్రకారం ది గోట్ మూవీ అక్టోబర్ లో  స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.  సాధారణంగా  హిట్ సినిమా అయితే..  కొన్ని రోజులు లేట్  గా  వస్తుంది కానీ,. మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమా త్వరగానే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతుంది.  ఇక వచ్చే వారం కొత్త సినిమాలు ఉంటే కనుక.. ది గోట్ పక్కకు  తప్పుకోక మానదు. మరి  థియేటర్ లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా  ఓటీటీలోనైనా  హిట్ టాక్ అందుకుంటుందేమో చూడాలి.

Related News

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Devara : దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

Deepika Padukone: గారాల పట్టికి దీపికా ఫస్ట్ గిఫ్ట్… ఏం కొనిపెట్టిందో తెలుసా?

Mad First Single: ఆ “లచ్చి” ప్లేస్ లో “లడ్డు” పెట్టి అదే పాటను మార్చి ఇచ్చేసాడు

Big Stories

×