BigTV English

Sai Pallavi : నోరు జారిన సాయి పల్లవి.. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని మరి తిట్టిపోస్తున్న జనం

Sai Pallavi : నోరు జారిన సాయి పల్లవి.. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని మరి తిట్టిపోస్తున్న జనం
Advertisement

Sai Pallavi : కొన్నిసార్లు కొన్ని విషయాలపై మాట్లాడినప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి నోటి నుంచి మాట బయటకు వచ్చిన తర్వాత అది ఎటువంటి అనర్ధాలకు దారితీస్తుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ అంశాలపై ఎంత మాట్లాడకుంటే అంత మంచిది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు మామూలుగా ఉన్నా కూడా ఈ సోషల్ మీడియా జనరేషన్లో అవే మాటలు కొన్నేళ్ల తర్వాత మనకి ఇబ్బందిని తీసుకొస్తాయి. ఇప్పటికే చాలామంది పొలిటిషియన్స్ ఒక పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మరో పార్టీలోకి చేరినప్పుడు ముందు మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతుంటాయి. ఇది అసలు క్యారెక్టర్ అంటూ ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం సాయి పల్లవి పరిస్థితి కూడా అలానే ఉంది.


సాయి పల్లవి గతంలో వ్యాఖ్యలు

సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళం ప్రేమమ్ సినిమా విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాలోని మలార్ క్యారెక్టర్ కు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ ను కూడా ఫిదా చేసింది. తెలుగులో సాయి పల్లవికి మంచి మార్కెట్ ఉంది. ఇక కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా సాయి పల్లవి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ చాలామందికి విపరీతంగా నచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో సాయి పల్లవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.


గత కొన్ని రోజుల ముందు కశ్మీరీ ఫైల్స్ సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో వాళ్ళు చూపించారు అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్ ని ఎలా చంపారు అని, ఒక రిలీజియస్ కాన్ఫిట్ లాగా తీసుకుంటే కోవిడ్ టైంలో ఒక వ్యక్తి వ్యాన్ లో ఆవును తీసుకెళ్తూ ఉన్నాడు. బండి డ్రైవ్ చేసే వ్యక్తి ముస్లిం. అప్పుడు ఆ వ్యక్తిని కొంతమంది కొట్టి జైశ్రీరామ్ అని అరిచారు. అయితే అప్పుడు జరిగిందానికి ఇప్పుడు జరిగిందానికి పెద్ద తేడా ఏముంది అని గతంలో మాట్లాడారు. అలా మాట్లాడటం వలన సాయి పల్లవి ట్రోల్ కి గురి అవుతున్నారు.

పహల్గామ్ దుర్ఘటనపై ట్వీట్

ఇక రీసెంట్ గా జరిగిన పెహల్గామ్ దుర్ఘటనపై సాయి పల్లవి ట్వీట్ చేశారు.
“పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని.. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది. ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుంచి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.. ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని, ప్రార్థనలను అందిస్తున్నాను” ప్రస్తుతం ఈ ట్వీట్ ను అటాచ్ చేస్తూ, పాత వీడియో పెట్టి సాయి పల్లవి అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×