Shobha Shetty:ఈమధ్య కాలంలో బుల్లితెర నటీనటులు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కార్తీకదీపం’ సీరియల్ ద్వారా మౌనిత క్యారెక్టర్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది శోభా శెట్టి (Shobha Shetty). ఈ క్యారెక్టర్ తో బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7) లో కూడా పాటిస్పేట్ చేసి అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో టైటిల్ విన్నర్ అవ్వాలని ఎన్నో కలలు కంది. కానీ ఆమె కోపమే ఆమెకు శత్రువుగా మారిందని చెప్పవచ్చు. ఇక చివర్లో ఎలిమినేట్ అయ్యింది. అలా టాప్ ఫైవ్ కి కూడా చేరుకోలేకపోయింది. ఇక్కడ వచ్చిన క్రేజ్ తో కన్నడ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక వెంటనే హోస్ట్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)ను వేడుకొని మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
హ్యాపీ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అంటున్న శోభా శెట్టి..
ఇక ప్రస్తుతం పలు షాప్ ఓపెనింగ్ మాల్స్ కి వెళ్తూ సందడి చేస్తున్న ఈమె జ్యువెలరీ బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇదిలా శోభా శెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తాను లవ్ లో ఉన్నట్లు తెలిపింది.ప్రముఖ సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డి (Yashwanth Reddy) తో ప్రేమలో ఉన్నట్లు తెలిపిన ఈమె.. గత ఏడాది జనవరిలో తాంబూలాలు మార్చుకొని, మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఏడాది కావస్తున్నా ఇంకా పెళ్లెప్పుడు అనేది చెప్పలేదు. అయితే ఇప్పుడు మరొకసారి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఎన్నిసార్లు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అంటూ ఆ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను, ఆ రింగులను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ఈ జంట. మొత్తానికైతే ఎంగేజ్మెంట్ చేసుకొని ఏడాది అయింది. ఎంగేజ్మెంట్ యానివర్సరీ ని కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. మరి పెళ్లెప్పుడు చేసుకుంటారో చూడాలి.
శోభా శెట్టి కెరియర్..
శోభా శెట్టి విషయానికి వస్తే.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ అలరించే ఈమె.. చాలా చక్కగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే అటు గ్లామర్ ఫోటోలు ఇటు సాంప్రదాయ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. కనీసం ఇప్పటికైనా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఎంగేజ్మెంట్ దుస్తుల్లో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి చాలా చక్కగా దేవతామూర్తుల్లా కనిపిస్తున్నారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.