BigTV English

Sai Pallavi: చెల్లి పెళ్లిలో ఏ అక్క అయినా మరీ ఇంత దారుణంగా ఉంటుందా.. ?

Sai Pallavi: చెల్లి పెళ్లిలో ఏ అక్క అయినా మరీ ఇంత దారుణంగా ఉంటుందా.. ?

Sai Pallavi: లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగువారిని ఫిదా  చేసిన ఈ బ్యూటీ.. సినిమాలతో కాకుండా  తన వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఫ్యాన్స్ గా మార్చుకుంది.  ఒక సినిమాను కుటుంబంతో కలిసి చూడాలంటే భయపడే ఈ జనరేషన్ లో.. సాయి పల్లవి సినిమానా  నిర్మొహమాటంగా కుటుంబంతో కలిసి  చూడొచ్చు.. ఆమె ఉన్న సినిమాలో వల్గారిటీ ఉండదు, గ్లామర్ ఆరబోయదు అని చిన్న పిల్లలను అడిగినా చెప్పుకొస్తారు.


సినిమాలోనే కాదు బయటకూడా ఆమె ఎంతో సింపుల్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. సాధారణంగా ఏ అక్క అయినా.. చెల్లి పెళ్లిలో  ఎలా ఉంటుంది. ఒంటి నిండా నగలు పెట్టుకొని, రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని.. ఆ పెళ్లి హడావిడి మొత్తం తానే చేస్తున్నట్లు ఫోజులు కొడుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

కానీ,  సాయి పల్లవి ఇందుకు విభిన్నం. చెల్లి పెళ్లిలో ఆమెకు అక్కగా  కాకుండా అమ్మగా మారింది.  చెల్లి పెళ్లి బాధ్యత మొత్తం తానే దగ్గర ఉండి నడిపించింది. ఈ మధ్యనే  సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ వివాహం, వినీత్ తో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికీ  సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవ్వడానికి పూజా పెళ్లి అయినా ..  హడావిడి అంతా  సాయి పల్లవిదే.


పూజాను రెడీ చేయించడం దగ్గరనుంచి తాళి కట్టించి అత్తారింటికి పంపేవరకు అన్ని  సాయి పల్లవినే చూసుకుంది.  ఈ పెళ్ళిలో పూజాకు సాయి పల్లవి మెహందీ పెట్టింది కానీ, ఆమె పెట్టుకోలేదు. ఫోటోషూట్ లో చెల్లికి సహాయం చేసింది. చాలా సాధారణమైన అమ్మాయిలా సింపుల్ గా డ్రెస్ వేసుకొని కనిపించింది. అన్ని పనులు చేస్తూ.. పూజా తల్లినే మర్చిపోయేలా చేసింది.

ముఖ్యంగా పెళ్లిలో కూడా ఈ చిన్నది ఎంతో సాంప్రదాయబద్దంగా కనిపించి ఔరా  అనిపించింది.  ఇక ఈ వీడియోలు చూసిన అభిమానులు చెల్లి పెళ్లిలో ఏ అక్క అయినా మరీ ఇంత దారుణంగా ఉంటుందా.. ? ఇంత సింపుల్ గా కనిపిస్తుందా..? అది కేవలం సాయి పల్లవి వలనే అవుతుంది. అందుకే  ఆమె తలైవి అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికొస్తే .. తండేల్, అమరన్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. హిందీ రామాయణం సెట్స్ మీద ఉంది. మరి ఈ సినిమాలతో సాయి పల్లవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×