BigTV English

Salaar : శ్రీరాములు థియేటర్లో ఒంటిగంట షో తో షురూ కాబోతున్న సలార్

Salaar  : శ్రీరాములు థియేటర్లో ఒంటిగంట షో తో షురూ కాబోతున్న సలార్
Salaar

Salaar : సినీ ప్రేక్షకుల సెన్సేషనల్ పండుగ రానే వస్తుంది.. అదేనండి సలార్ రిలీజ్ డేట్ దగ్గర యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న హై బడ్జెట్ చిత్రం సలార్. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం కు డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటిగంటకు మొదటి షో మొదలు కాబోతోంది. అంటే డిసెంబర్ 21 అర్ధరాత్రి నుంచే సలార్ సంబరాలు షురూ అవుతాయి అన్నమాట. క్రిస్మస్ ,న్యూ ఇయర్ ,సంక్రాంతి.. మూడు పండుగలు ముచ్చటైన కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది.


శ్రీరాములు థియేటర్లో.. డిసెంబర్ 21 ఒంటిగంటకు మొదలయ్యే షో చూడడం కోసం ఎందరో సినీ సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్.. శ్రీరామ్ థియేటర్లో మొదలు కాబోయే ఒంటిగంట షోకి హాజరు కాబోతున్నట్లు ప్రకటించేశాడు. అంతటితో ఆగకుండా ఏకంగా 100 టికెట్లు కొని.. తన తరఫున ప్రభాస్ అభిమానులకు ఇవ్వబోతున్నట్టు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

ఇక ప్రభాస్ కి సంబంధించిన సినిమాల గురించి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల క్రితం ప్రభాస్ మిర్చి మూవీని ఇదే శ్రీరాములు థియేటర్లో అర్ధరాత్రి షో చూశానని.. ఇప్పుడు కూడా సలార్ మూవీ అదే రకంగా చూడబోతున్నానని.. అయితే అది ఒంటరిగా కాకుండా 100 మంది ప్రభాస్ అభిమానులతో కలిసి అన్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇలా ప్రభాస్ పై ఉన్న అభిమానం చాటుకుంటూ అతని అభిమానులకు ఏకంగా 100 టికెట్లు ఇస్తాను అని నిఖిల్ అనడంతో.. ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


ఇక నిఖిల్ తో పాటు ఎందరో సెలబ్రిటీలు ఎప్పుడెప్పుడు సలార్ వస్తుందా.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కు కేవలం మామూలు ప్రేక్షకులే కాక సెలబ్రిటీలలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు అన్న విషయానికి ఇది మరొక ఉదాహరణ. విడుదలకు ముందే అందరిలో ఎక్సైట్మెంట్ రగులుస్తూ పిచ్చ హైప్ తో ముందుకు వెళ్తున్న ఈ మూవీ విడుదల అయ్యాక ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×