BigTV English

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Sydney Sweeney Bollywood Entry:

ఇప్పటికే పలువురు హాలీవుడ్ బ్యూటీస్.. బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్..ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మరో హాలీవుడ్ హాట్ బ్యూటీ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాలో నటనకు గాను ఆమె కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె నటించే సినిమాకు తీసుకోబోయే పారితోషికం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


బాలీవుడ్ లోకి సిడ్నీ స్వీనీ ఎంట్రీ!   

తాజాగా నివేదికల ప్రకారం, బాలీవుడ్‌ లో నిర్మించబోయే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో సిడ్నీ స్వీనీని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఈ హాలీవుడ్ స్టార్‌ కు 45 మిలియన్ పౌండ్ల(రూ.530 కోట్లకు పైగా) రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో 35 మిలియన్ పౌండ్లు (రూ.415 కోట్లకు పైగా) రెమ్యునరేషన్ కాగా, 10 మిలియన్ పౌండ్లు( రూ. 115 కోట్లకు పైగా) స్పాన్సర్‌ షిప్ ఒప్పందాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిడ్నీకి హాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కారణంగా తమ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నట్లు నిర్మాతలు భావిస్తున్నారట.

అమెరికన్ స్టార్ పాత్రలో సిడ్నీ స్వీనీ!

ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో సిడ్నీ ఒక యువ అమెరికన్ స్టార్ పాత్రను పోషిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు, భారతీయ సెలబ్రిటీతో ప్రేమలో పడుతుందట. ఈ చిత్రం 2026 ప్రారంభంలో సెట్స్ మీదికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్  న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్‌ తో సహా పలు ప్రదేశాలలో జరుగుతుందని భావిస్తున్నారు. “సిడ్నీ తొలుత ఈ ఆఫర్‌ తో ఆశ్చర్యపోయింది. రూ.530 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అనేది ఊహించలేకపోయింది. ఈ చిత్రం అమె క్రేజ్ ను మరింత పెంచనుంది. భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేయడానికి ఆమె ఈ చిత్రంలో నటించడం చాలా అవసరం అని నిర్మాతలు భావిస్తున్నారు” అని ఓ నివేదిక వెల్లడించింది. అటు ఈ ఆఫర్ గురించి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. “సిడ్నీ ఈ ఆఫర్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదో పెద్ద అవకాశం అయినా, ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆమెకు చాలా ప్రాజెక్టులు ఉన్న నేపథ్యంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది” అని నివేదికలు తెలిపాయి.


సిడ్నీ కెరీర్ గురించి..

‘యుఫోరియా’, ‘బ్లాక్ కామెడీ’, ‘ది వైట్ లోటస్‌’ లాంటి టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సిడ్నీ. ఆమె త్వరలో ‘క్రిస్టీ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ కవర్‌పై కనిపించిన మొదటి మహిళా బాక్సర్ అయిన యుఎస్ ప్రో ఫైటర్ క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషిస్తోంది.ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. సిడ్నీ ఎక్కువగా న్యూడ్ సీన్స్ లో కనిపిస్తుంది. అందుకే హాలీవుడ్ లో పాపులర్ అయ్యింది. చాలా మందికి ఫేవరెట్ గా మారింది. అందుకే బాలీవుడ్ కన్ను ఆమె మీద పడింది. అప్పట్లో సన్నీలియోన్‌  విషయంలోనూ బాలీవుడ్ నిర్మాతలు ఇలాగే చేశారు. ఇప్పుడు సిడ్నీ విషయంలోనూ అలాగే చేస్తున్నారు.

Read Also:  నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Related News

Actress Raasi: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Actress Raasi : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Actress Raasi : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Big Stories

×