E-Paper
Advertisement

Salaar Story : ప్రశాంత్ నోట సలార్ స్టోరీ లీక్ .. ఇంతకీ స్టోరీ అదేనట..

Salaar Story : ప్రశాంత్ నోట సలార్ స్టోరీ లీక్ .. ఇంతకీ స్టోరీ అదేనట..
Advertisement

Salaar Story : ప్రభాస్ ..ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేజిఎఫ్ క్రేజ్ డైరెక్టర్ తో డార్లింగ్ మూవీ కావడంతో దీనిపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 22 కి విడుదల కాబోతోంది. డార్లింగ్ ఫాన్స్ ఈ మూవీతో ప్రభాస్ బాహుబలి రేంజ్ అందుకోవాలి అని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మూవీ స్టోరీ గురించి ప్రశాంత్ నీల్ లీక్ చేసిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇందులో అంచనాలకు మించి యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్టు టాక్. అంతేకాదు ఈ మూవీకి కేజిఎఫ్ సిరీస్ కి లింకు కూడా ఉంది అని కొద్ది రోజులుగా ఆన్లైన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయి అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈ మూవీ కి కేజీఎఫ్ సిరీస్ కి కనెక్షన్ ఉందా? ఒకవేళ కనెక్షన్ ఉంటే అది కేజిఎఫ్ స్టోరీ కి ముందా లేక వెనకా? అనే విషయాలపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతున్నాయి.

Advertisement

అయితే ప్రస్తుతానికి మూవీ స్టోరీ ను డైరెక్టర్ లీక్ చేసేసాడు.. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులుగా ఎలా మారారు అనే కాన్సెప్ట్ పై ఈ మూవీ స్టోరీ ఆధారపడి ఉంటుందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్షిప్ అనేది ఈ మూవీలో ఒక కోర్ ఎమోషన్ అట.. సలార్ రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే కదా.. మొదటి భాగం సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో కొంత కథ చెబుతారట.. ఆ తర్వాత రెండవ భాగంలో పూర్తిగా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారట. దీన్ని బట్టి చూస్తే సలార్ చిత్రానికి..కేజీఎఫ్ సిరీస్ కు ఎటువంటి లింక్ లేదు అని అర్థమవుతుంది. అయితే మరోపక్క ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ప్రభాస్.. యశ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా అనేవారు కూడా ఉన్నారు. మొత్తానికి స్టోరీ ఏంటి అనేది ఫస్ట్ పార్ట్ విడుదల అయ్యాకే మన క్లియర్ గా అర్థమవుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×