Big Stories

Team India : ఎక్కడున్నారు? టీమ్ ఇండియా సీనియర్స్!

Share this post with your friends

Team India : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా సీనియర్లు ఎక్కడికి వెళ్లారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలీదు. ప్రపంచానికి దూరంగా వెళ్లారని కొందరు అంటున్నారు.  సోషల్ మీడియాకి చిక్కకుండా రహస్యంగా ఉన్నారు. మరి ఇళ్లల్లోనే ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? లేకపోతే ఎక్కడైనా రిఫ్రెష్ అవుతున్నారా? అనేది చిదంబర రహస్యంగా ఉంది.

మహ్మద్ షమీ మాత్రం నైనిటాల్ లో గడిపేందుకు స్నేహితులతో వెళ్లాడు. ఆ దారిలో ఒక వ్యక్తి ప్రాణాలను కూడా కాపాడాడు. అలా తన గురించి తెలిసింది. అలాగే వరల్డ్ కప్ లో ఆడిన ముగ్గురిలో సూర్యకుమార్ యాదవ్ ఆసిస్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కి కెప్టెన్ గా ఉన్నాడు. ఇంకా ఇషాన్ కిషన్, ప్రసిద్ధ క్రష్ణ సిరీస్ లో ఆడుతున్నారు. నాలుగో మ్యాచ్ కు శ్రేయాస్ అయ్యర్ రానున్నాడు. కాబట్టి తను కూడా ప్రపంచంతో కనెక్ట్ అవుతాడు.

వీరు కాకుండా అప్పుడప్పుడు అశ్విన్ సోషల్ మీడియాపై మెరుస్తున్నాడు. అలా అలా వచ్చి ఏదొకటి చెప్పి వెళ్లిపోతున్నాడు. తర్వాత అంతా నిశ్శబ్ధం.. మిగిలిన వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనే సంగతి ఎవరికీ తెలీదు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా,  కేఎల్ రాహుల్, బుమ్రా, లాంటి సీనియర్లు, వీరితో పాటు శుభ్ మన్ గిల్, సిరాజ్, కులదీప్ యువకులు కూడా అజ్నాతంలోకి వెళ్లారు.  వీరిలో ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడిన పాపాన పోలేదు.

అయితే ఒక విషయం ఏమిటంటే, క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, ఇంకా మీడియా కూడా వారిని పట్టించుకోలేదు. వారిపై ఆరా తీయలేదు. వారికి మనశ్శాంతిని ఇద్దామని, తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని కదిలించకూడదు, కొన్నిరోజులు ప్రశాంతంగా ఉండనివ్వాలని భావించినట్టున్నారు. వారి జోలికే వెళ్లలేదు. ఇదొక మంచి పరిణామం అని చెప్పాలి.

చాలామంది రిటైరైన క్రికెటర్లు చెప్పేమాట ఏమిటంటే ఇలాంటి మెగా టోర్నీల్లో ఫైనల్ వరకు వచ్చి ఓటమి పాలైతే మాత్రం చాలారోజులు రాత్రిళ్లు నిద్ర పట్టదని, సడన్ గా మధ్యలో తెలివి వస్తుందని, చాలా చికాకుగా ఉంటుందని, ఏ పనీ చేయబుద్ది కాదని, మెంటల్ గా చాలా డిస్ట్రబెన్స్ ఉంటుందని చెబుతున్నారు.

ఎందుకంటే ఎంతో పీక్స్ కి వెళ్లినవాళ్ల మనసు, మెదడు, నరం నరం అక్కడ నుంచి అంత త్వరగా కిందకు దిగవని చెబుతున్నారు. దానికి టైమ్ పడుతుంది. ఆ సమయంలో సైక్రియాట్రిస్టులు, సైకలాజిస్టులు, బీసీసీఐ వైద్య సిబ్బంది వీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పుకొచ్చారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News