BigTV English

Salman Khan: సల్మాన్ చెల్లెలికి కూడా బెదిరింపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కుటుంబం..!

Salman Khan: సల్మాన్ చెల్లెలికి కూడా బెదిరింపులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కుటుంబం..!

Salman Khan.. నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique)అత్యంత ఘోరంగా హతమార్చబడిన విషయం అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈయన హత్య తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరొకవైపు తన వ్యక్తిగత రక్షణ కోసం ఇప్పటికే లైసెన్స్ రివాల్వర్ తీసుకున్న ఈయన , మరొకవైపు కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బయటికి వెళ్లాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు సల్మాన్ ఖాన్. దీనికి తోడు 60 మంది పవర్ ఫుల్ సెక్యూరిటీ మధ్య బిగ్ బాస్ సీజన్ 18 వ కార్యక్రమానికి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు.


కట్టుదిట్టమైన భద్రత మధ్య సల్మాన్ ఖాన్ జీవనం..

దీనికి తోడు రూ .2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కొనుగోలు చేశారు. అలాగే సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత కూడా ముంబై పోలీసులు ఏర్పాటు చేశారు. సన్నిహితులు, అభిమానులు, సెల్ఫీలు, ఫోటోగ్రాఫర్స్ అనుమతిని కూడా నిరాకరించారు. ముఖ్యంగా సల్మాన్ సన్నిహితులు బంధువులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులకు కూడా భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. మొత్తం ముంబై పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి బిష్ణోయ్ (Bishnoi )వర్గానికి చెందిన సభ్యులను గాలిస్తున్నారట.ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత (Arpita)కి కూడా బెదిరింపులు రావడంతో ఈమె తన కుటుంబంతో కలిసి ఊహించని నిర్ణయం తీసుకుందని సమాచారం.


సల్మాన్ ఖాన్ చెల్లెలికి కూడా తప్పని బెదిరింపులు..

తాజాగా అర్పిత బాంద్రాలోని తన ఇంటిని కూడా అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బాంద్రా నుండి వర్లీ కి మకాం మార్చబోతోందని సమాచారం. సల్మాన్ ఖాన్ చెల్లెలైన అర్పిత (Arpita)కి కూడా బిష్ణోయ్ కమ్యూనిటీ నుండి బెదిరింపులు ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఆమె భర్త ఆయుష్ శర్మ (Ayush Sharma)బాంద్రాలోని విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 1750 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇంటిని ఇప్పుడు రూ .22 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. త్వరలోనే ఆమె వర్లీ లోని తన కొత్త ఇంటికి మారబోతోంది. ఆయుష్ శర్మ, అర్పితా ఖాన్ దగ్గరుండి మరి తమ ఇంటిని చాలా గ్రాండ్ గా, హుందాగా , అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్నారు. సల్మాన్ ఖాన్ కుటుంబానికి జ్ఞాపకంగా మిగిలిన ఈ ఇల్లు ఏకంగా 1750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది.. అప్పట్లో ఈమె 10 కోట్ల రూపాయలకు మాత్రమే దీనిని కొనుగోలు చేసింది. దీని స్టాంప్ డ్యూటీని ఫిబ్రవరి 4 2022న చెల్లించింది.

ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని అమ్మేసిన అర్పిత..

ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంటితో పూర్తి అనుబంధాన్ని పెంచుకున్నారు ఈ కుటుంబ సభ్యులు. ఇక ఇప్పుడు బిష్ణోయ్ వర్గీయుల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ ఇంటిని వారు అమ్మినట్లు తెలుస్తోంది. ఇక ఇంటిని అమ్మేసిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను అర్పిత ,ఆయుష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏది ఏమైనా ఒక కమ్యూనిటీ బెదిరింపులకు తాళలేక ఇష్టపడి కొనుక్కున్న ఇంటిని కూడా అమ్మేసుకోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అర్పిత షేర్ చేసిన ఆ ఇంటి ఫోటోలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×