BigTV English

CM Chandrababu: కుప్పంలో అధికారుల నిర్వాకం.. సీఎం చంద్రబాబుకు దక్కని చోటు.. సోషల్ మీడియాలో వైరల్

CM Chandrababu: కుప్పంలో అధికారుల నిర్వాకం.. సీఎం చంద్రబాబుకు దక్కని చోటు.. సోషల్ మీడియాలో వైరల్

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే పలువురు అధికారుల వ్యవహార శైలి ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. స్వయాన సీఎం సొంత నియోజకవర్గం కావడంతో.. ఆ అధికారులు చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. ఇంతకు ఏమి జరిగింది? ఈ విషయం పై తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా స్పందించారో తెలుసుకుందాం.


చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరో కాదు సాక్షాత్తు సీఎం చంద్రబాబు. సాధారణంగా కుప్పం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా.. స్థానిక ఎమ్మెల్యే, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు పేరు తప్పనిసరిగా ప్రతి అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకంపై ఉంటుంది. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు పేరును తప్పనిసరిగా పలు కార్యక్రమాలలో ప్రోటోకాల్ ప్రకారం ప్రచురించాల్సిందే. కానీ సీఎం సొంత నియోజకవర్గం చెందిన కొందరు అధికారులు.. ఆ మాటను మరిచారేమో కానీ, ఏకంగా చంద్రబాబు పేరును ప్రచురించడం మరచిపోయారు.

కుప్పంలో ద్రావిడ వర్శిటీ 27వ వార్షికోత్సవాన్ని నేడు యూనివర్సిటీ అధికారులు నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేయడమే కాక, ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఆ ఆహ్వాన పత్రికలో చిత్తూరు లోక్ సభ పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఐఏఎస్ అధికారులు సుమిత్ కుమార్, వికాస్ మర్మత్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దొరస్వామి, ప్రొఫెసర్ సంపత్ కుమార్ ల పేర్లను ముద్రించారు.


అయితే యూనివర్సిటీకి సంబంధించిన ఆహ్వాన పత్రికలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు పేరు ముద్రించకపోవడం విశేషం. కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అలాగే సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు పేరును అధికారులు మరిచిపోవడం, అలాగే ఆహ్వాన పత్రిక అందుకున్న టిడిపి నేతలు సైతం యూనివర్సిటీ అధికారులకు జరిగిన పొరపాటున తెలపకపోవడం విశేషం. ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Divvala Maduri: దివ్వెల మాధురి ఇంటికెళ్లిన పోలీసులు.. స్వయంగా నోటీసులు జారీ.. ఏ కేసులో తెలుసా!

యూనివర్శిటీ అధికారులు కూడా ఈ ఒక్క విషయాన్ని ఎలా గుర్తించలేదో కానీ, సీఎం స్వంత నియోజకవర్గంలో చేస్తున్న ప్రతి కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని టీడీపీ క్యాడర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు మాత్రం ఇది చిన్న తప్పిదమే.. నెక్స్ట్ ఇలా కాకుండా చూడండీ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Kurupam Incident: కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

AP Rains: ఏపీలో మళ్లీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుపాటు హెచ్చరికలు

Srisailam Temple: తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు సమీక్ష.. డిప్యూటీ సీఎం కీలక సూచన

CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

Coconut Price: కొండెక్కిన కొబ్బరి కాయల ధర.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

Auto Drivers Sevalo: ఆటో డ్రైవర్ల సేవలో.. జగన్ కోలుకోవడం కష్టం

Chandrababu OG: ఓజీ ఓజీ ఓజీ.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ బాహుబలి సీన్ రిపీట్, చంద్రబాబు ఏం అన్నారంటే?

AP Social Media: సోషల్ మీడియాపై నియంత్రణ.. కూటమి వ్యూహం, వైసీపీ ప్రతి వ్యూహం

Big Stories

×