E-Paper
Advertisement

Samantha: ఇకపై ప్రేమ, కృతజ్ఞతతోనే కొనసాగుతా: సమంత

Samantha: ఇకపై ప్రేమ, కృతజ్ఞతతోనే కొనసాగుతా: సమంత
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోలేదు సామ్. వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టడంతో ఫుల్ బిజీ అయిపోయింది. తక్కువ సమమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకొని.. అగ్రహీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

2010లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఏమాయ చేసావే సినిమా’లో జెస్సీ పాత్రలో నటించి అలరించింది సామ్. గౌతమ్ మేనన్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సామ్ ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. తాను ఎంత ఎదిగినా అభిమానులు చూపించే ప్రేమను మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో తనను ఎన్నో విషయాలు బాధించేవని.. ఇకపై ప్రేమ, కృతజ్ఙతతోనే కొనసాగుతానని చెప్పుకొచ్చింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతోంది.

Advertisement

ఇక ఈ సినిమా ద్వారా దగ్గరైన సామ్-చై ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొద్దిరోజుల పాటు డేటింగ్‌లో ఉండి.. 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే అనుకోని కారణాల వల్ల సామ్-చై 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత కెరీర్ పైనే ఫోకస్ పెట్టిన సమంత. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. సమంత కెరీర్ సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊహించని రీతిలో బ్రేక్ పడింది.

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది సామ్. దాదాపు 9 నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తిరిగి సినిమాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవల సమంత నటించిన ‘యశోద’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సామ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. అలాగే ‘శాకుంతలం’ సినిమాతో పాటు ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ చేస్తుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×