BigTV English

Lay Off Robots:రోబోలకు కూడా లేఆఫ్ తాకిడి.. గూగుల్ నిర్ణయం..

Lay Off Robots:రోబోలకు కూడా లేఆఫ్ తాకిడి.. గూగుల్ నిర్ణయం..

Lay Off Robots:ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కంపెనీల దృష్టంతా లే ఆఫ్ పైనే ఉంది. ఎందరో ప్రతిభావంతులైన ఉద్యోగులు కూడా ఈ లే ఆఫ్ కల్చర్ వల్ల ఉద్యోగాలను కోల్పోయారు. స్టార్టప్స్ దగ్గర నుండి లాభాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల వరకు అన్ని సంస్థలు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి. తాజాగా గూగుల్.. తన సంస్థలో పనిచేసే మనుషులనే కాదు.. రోబోలను కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇది అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.


రోబోలు అనేవి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోనే కాదు.. రెస్టారెంట్లలో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో.. ఇలా చాలా రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. వాటికి చెప్పిన ఫంక్షన్‌ను కరెక్ట్‌గా చేస్తూ.. రోబోలు చాలామందికి ఉపయోగకరంగా మారాయి. అలాగే గూగుల్ మెయిన్ ఆఫీస్‌లో కూడా 100 రోబోలు క్యాంటీన్‌ను శుభ్రం చేసే విభాగంలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆ రోబోలపై కూడా లే ఆఫ్ ఎఫెక్ట్ పడనుంది.

ఇప్పటికే ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీలలాగా గూగుల్ కూడా 12,000 మందిని ఉద్యోగంలో నుండి తొలగించారు. అంతే కాకుండా కొంతకాలం నుండి గూగుల్ తరపున.. ‘ఎవ్రీడే రోబోట్స్’ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టారు సీఈఓ సుందర్ పిచై. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 100 రోబోలను ఆఫీస్ క్యాంటీన్‌లను శుభ్రం చేయడానికి ట్రెయిన్ చేశారు. ఈ రోబోలు టేబుల్స్‌ను శుభ్రం చేయడంతో పాటు వాటి రీసైక్లింగ్‌కు కూడా ఉపయోగపడేవి. అంతే కాకుండా గూగుల్‌లోని పలు ఇతర విభాగాల్లో కూడా ఈ రోబోలు సేవలందించాయి.


కోవిడ్ సమయంలో కాన్ఫరెన్స్ రూమ్స్‌ను శుభ్రం చేయడానికి, వాటిని శానిటైజ్ చేయడానికి ఈ రోబోలనే ఉపయోగించేవారు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు బ్రేక్ ఇవ్వాలని గూగుల్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా రోబోల విభాగం మూసివేయడంతో ఇందులో ఉన్న టెక్నాలజీని ఇతర విభాగాల్లో ఉపయోగించాలని గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఒక్కసారిగా గూగుల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇతర సంస్థలు కూడా షాక్ అవుతున్నాయి.

Vehicle Headlights:హెడ్‌లైట్స్ వల్ల కళ్లకు ప్రమాదమా..? నిపుణుల రిపోర్ట్..

Vaccine For Covid:కోవిడ్‌కు కొత్త వ్యాక్సిన్.. మరింత మెరుగ్గా..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×