E-Paper
Advertisement

Samantha:సమంత ఏంటీ అలియా భట్ కోసం అలా చేస్తోంది? వర్కవుట్ అవుతుందా?

Samantha:సమంత ఏంటీ అలియా భట్ కోసం అలా చేస్తోంది? వర్కవుట్ అవుతుందా?
Advertisement

Samantha.. సాధారణంగా సౌత్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే నార్త్ హీరోయిన్స్ కి పాపులారిటీ భారీగా ఉంటుంది. ముఖ్యంగా నార్త్ హీరోయిన్స్ కి ఇచ్చే మర్యాద సౌత్ హీరోయిన్స్ కి ఇవ్వడం లేదనే ఒక వాదన కూడా తెరపై వినిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ కోసం మన సౌత్ హీరోయిన్స్ స్టాండ్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న అలియా భట్ (Alia Bhatt) కోసం మన సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నిలబడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

అలియా భట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంత..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. అలియా భట్ తాజాగా నటించిన చిత్రం జిగ్రా.. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ వాసన్ బాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఇకపోతే తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులలో కూడా ఆత్రుత పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంత ముఖ్యఅతిథిగా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అయితే అలియా భట్ హీరోయిన్గా నటించిన జిగ్రా సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంత ముఖ్యఅతిథిగా రాబోతోందని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేయడమే కాదు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.

జిగ్రా మూవీ విశేషాలు..

Advertisement

ఇకపోతే జిగ్రా సినిమా విషయానికొస్తే.. ఆదిత్యానంద, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ తో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా వేదాంగ్ రైనా ఈ సినిమాలో ఆలియా కి సోదరుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ధర్మా ప్రొడక్షన్స్ , ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏదేమైనా బాలీవుడ్ మూవీ కి మన సౌత్ హీరోయిన్ చీఫ్ గెస్ట్ గా వెళ్లడం ఒకరకంగా గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు. మరి సమంత చీఫ్ గెస్ట్ గా రాబోతోంది. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సమంత కెరియర్..

ఇక సమంత విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ హనీ బన్నీలో నటించింది. త్వరలోనే అమెజాన్ ఓటిటి ప్లాట్ ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా మరొకవైపు వ్యక్తిగత విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. సమంత తనకు ప్రమేయం లేకపోయినా తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈషా ఫౌండర్ సద్గురు జీ దగ్గర హిందూ మతాన్ని స్వీకరించిన సమంత, నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తూ.. ఇటీవల ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×