BigTV English
Advertisement

Samantha: తండ్రి అయిన నితిన్ పై సమంత ఎందుకలా రియాక్ట్ అయింది?

Samantha: తండ్రి అయిన నితిన్ పై సమంత ఎందుకలా రియాక్ట్ అయింది?

Samantha coment viral on hero Nithins new born baby: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎలాంటి క్లాస్, మాస్ అయినా ఈజీగా చేసేయగల సత్తా ఉన్న హీరో నితిన్. అయితే దర్శకుడు తేజ నితిన్ లోని ట్యాలెంట్ ను చూసి జయం సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. తొలి సినిమానే అనుభవం ఉన్న స్టార్ నటుడిగా చేయడంతో నితిన్ కు ఆఫర్లు వెల్లువెత్తాయి. రాజమౌళి కూడా నితిన్ లో ఉన్న ఫైర్ ని చూసి సై మూవీలో అవకాశం ఇచ్చాడు. నితిన్ తండ్రి తెలంగాణ ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూటర్. నితిన్ నిర్మాతగా మారి ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి సినిమాలను నిర్మించారు. అయితే నితిన్ కొంత కాలం క్రితం షాలిని అనే అమ్మాయిని ప్రేమించి 2020 సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి చేసుకున్నారు.


సడన్ సర్ప్రైజ్

తమ పెళ్లిని దుబాయ్ లో ఎంతో వైభవంగా ప్లాన్ చేసుకున్న నితిన్ అప్పట్లో కరోనా కారణంగా విదేశాలకు అనుమతి లేకపోవడంతో ఇండియాలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే చాలా కాలంగా తన భార్య గర్భవతి అన్న విషయం గోప్యంగా ఉంచారు నితిన్. సడెన్ గా సోషల్ మీడియాలో తనకు కొడుకు పుట్టాడని ప్రకటించి షాక్ ఇచ్చాడు అభిమానులకు. అయితే ఇప్పటికే వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి, సాయిధరమ్ తేజ్ వంటి ప్రముఖులు నితిన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. హీరో నితిన్ తన ఫ్యామిలీలోకి న్యూ స్టార్ వచ్చేశాడంటూ పోస్ట్ పెట్టారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ కేవలం కొడుకు తన చేతి వేళ్లను పట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నితిన్.అయితే చాలా మంది అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు నితిన్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ గ్రీటింగ్స్ చెబుతున్నారు. హీరోయిన్ సమంత కూడా వెరైటీగా చెప్పాలి అనుుందో ఏమిటో తెలియదు గానీ ‘ఓ మై గాడ్ కంగ్రాట్స్’ అంటూ కామంట్ చేశారు. అయితే సమంత కామెంట్స్ పై ప్రస్తుతం ట్రోలింగ్స్ అవుతున్నాయి.


సమంత కామెంట్ పై ట్రోలింగ్

ఓ మై గాడ్ అని ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం ఏమిటి? ఏదో ప్రమాదం జరిగినట్లు ఆ కామెంట్ ఏమిటని నెటిజన్స్ సమంతని ట్రోల్ చేస్తున్నారు. సమంత గత కొంతకాలంగా నాగచైతన్య ఎంగేజ్ మెంట్ తర్వాత సైలెంట్ గా మారింది. ఇటీవలే కేరళ సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ హేమ కమిటీ నివేదికకు తన మద్దతు ప్రకటించారు సమంత. పైగా టాలీవుడ్ లోనూ హేమ కమిటీ తరహాలో ఒకటి వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. సమంతకు ఈ విషయంలో మరికొందరు తారలు మద్దతుగా నిలిచారు. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలోనూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే సమంత ఏదో ప్రస్టేషన్ లో ఇలా మాట్లాడుతోందంటూ నితిన్ కు శుభాకాంక్షలు అలా చెప్పి వుండాల్సింది కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×