BigTV English
Advertisement

Mathu Vadalara 2 Trailer: మత్తు వదిలించిన ట్రైలర్.. మామూలుగా లేదు భయ్యా

Mathu Vadalara 2 Trailer: మత్తు వదిలించిన ట్రైలర్.. మామూలుగా లేదు భయ్యా

Mathu Vadalara 2 Trailer: శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘మత్తు వదలర 2’. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు. ఇందులో నటుడు సత్య, సునీల్, వెన్నెల కిషోర్, తదితర నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో వచ్చిన ‘మత్తు వదలర’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా అబ్బురపరచింది.


అంతేకాకుండా ఈ సినిమాతో శ్రీసింహాకు మంచి పేరు, క్రేజ్ కూడా వచ్చింది. అలా ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నారు. అదే ‘మత్తు వదలర 2’. ఈ సినిమా ఈ నెల అంటే సెప్టెంబర్ 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అప్డేట్‌లు అందించి సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగింది. మొదటి పార్ట్‌లో డెలివరీ బాయ్‌గా కనిపించిన శ్రీసింహా.. ఇప్పుడు రెండో పార్ట్‌లో స్పెషల్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు.

ఈ టీజర్‌లోని డైలాగ్‌లు చాలా మంది సినీ ప్రియుల్లో నవ్వులు పూయించాయి. వెల్‌కమ్ టు హీ టీమ్ అంటూ శ్రీసింహ, సత్యల ఎంట్రీ టీజర్‌కు మంచి ఎలివేషన్ అందించింది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ కామెడీ మరింత క్యూరియాసిటీ పెంచేసింది. అంతేకాకుండా ఈ టీజర్‌లో అట్రాక్షన్‌గా నిలిచింది ఎవరన్నా ఉన్నారా అంటే అది ఫరియా అనే చెప్పాలి. ఆమె ఇప్పటి వరకు క్లాసిక్ పాత్రలు చేసి ఎంతో మందిని అలరించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఫుల్ మాస్ అండ్ యాక్షన్ రోల్‌లో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేసింది.


Also Read: ‘మత్తు వదలరా 2’ టీజర్.. వెల్‌కమ్‌ టు హీ టీమ్, ‘హేమా’ను వదల్లేదుగా!

ఇలా టీజర్‌తో సినీ ప్రియుల్లో సరికొత్త జోష్ నింపిన మేకర్స్.. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైలర్ మొదట్లోనే శ్రీ సింహ, సత్య ఎంట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ఇందులో కూడా కామెడీ, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మొదటిగా స్పెషల్ ఆఫీసర్స్‌గా చేసిన శ్రీసింహా, సత్యలు.. ఆ తర్వాత నిందితులుగా ఎలా మారారు అనేది అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది.

కాగా ఈ ట్రైలర్ ప్రకారం చూస్తే.. ఇది ఒక డ్రగ్స్ నేపథ్యంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. స్లేవ్ అనే డ్రగ్‌ను ఎవరైనా తీసుకున్నవాళ్లు ఎవరేమ్ చెప్పినా చేస్తారు. దీని నేపథ్యంలోనే విలన్‌లు ఇది ఉపయోగించడం.. వారిని షీ టీం పట్టుకోవడం వంటివి సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×