BigTV English

Samantha: ఛ.. సమంత కామెంట్‌కు ఆ స్టార్ హీరోయిన్ రిప్లై ఇవ్వలేదేంటి..?

Samantha: ఛ.. సమంత కామెంట్‌కు ఆ స్టార్ హీరోయిన్ రిప్లై ఇవ్వలేదేంటి..?
Samantha
Samantha

Samantha: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంమత ఒకవైపు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.


ఇవేనా.. ఇంకా చాలానే ఉన్నాయి. సెలబ్రెటీలకు సంబంధించిన ఏ పోస్టుపై అయినా ఇట్టే రిప్లే ఇస్తుంది. బర్త్ డేస్, మ్యారేజ్.. ఇలా చాలా వాటికి సమంత స్మార్ట్‌ అండ్ స్వీట్‌గా స్పందిస్తుంది. అయితే ఇలానే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి కూడా సమంత రిప్లే ఇచ్చింది. కానీ ఆమె నుంచి మాత్రం ఇంకా సమంతకు రిప్లై రాలేదు.

అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా?.. ఆమె మరెవరో కాదండి.. కాజల్. రీసెంట్‌గా కాజల్ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇలా షేర్ చేసిందో లేదో టక్కున సమంత స్పందించింది. ఏదో కాజల్ ఫొటోల కోసమే ఎదురుచూస్తున్నట్లుగా వెంటనే రిప్లై ఇచ్చింది. కాజల్ ఫొటోలకు ‘బ్యూటిఫుల్’ అని కామెంట్ పెట్టింది.


Also Read: తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. అతని భార్య ఎవరో తెలుసా.. ?

కానీ కాజల్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో చాలా మంది వీరిద్దరికీ ఏమైనా గొడవలు జరిగియా?.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరేమో.. ఛా సమంత కామెంట్‌కి కాజల్ రిప్లై ఇవ్వలేదేంటి?.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు. కానీ కాజల్, సమంత ఫ్యాన్స్ మాత్రం ఆ కామెంట్‌ను చూసి సంబరపడిపోతున్నారు.

ఇకపోతే కాజల్, సమంత ఇద్దరూ మంచి స్నేహితులు. ఎన్టీఆర్‌తో ‘బృందావనం’ సినిమాలో సమంత, కాజల్ కలిసి కనిపించి మెప్పించారు. అంతేకాకుండా తమిల్, తెలుగులో సైతం వీరిద్దరూ కలిసి బాగానే మూవీలు చేశారు. ఈ ఇద్దరు భామలు కలిసి మరో సినిమాలో కనిపిస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. వరుస పెట్టి సినిమాలను చేసేందుకు కొన్ని స్టోరీలను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×