BigTV English
Advertisement

Samantha: సమంత కొత్త యాడ్ చూశారా.. ఫిదా అవ్వాల్సిందే..?

Samantha: సమంత కొత్త యాడ్ చూశారా.. ఫిదా అవ్వాల్సిందే..?

Samantha.. అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత జోరు పెంచిందనే చెప్పాలి. అందులో భాగంగానే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆలోచించిన ఈమె.. ఒకవైపు సినిమాలు, మరొకవైపు ప్రొడ్యూసర్ గా, ఇంకొక వైపు యాడ్స్ కూడా చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పటికే ఎన్నో యాడ్స్ చేసిన సమంత ఇప్పుడు మరో కొత్త యాడ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తాజాగా సమంత లక్స్ సోప్ కు సంబంధించిన యాడ్ చేసి అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.


లక్స్ సోప్ యాడ్ లో సమంత..

ఇకపోతే ఈ సోప్ యాడ్లో చాలా లగ్జరీగా కనిపించింది సమంత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా సౌత్ నుంచి నార్త్ వరకు చాలామంది స్టార్ హీరోయిన్లు లక్స్ సోప్ కి యాడ్ చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సమంత కూడా వచ్చి చేరింది. సమంత సబ్బు కోసం చేసిన యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతూ భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే నాగచైతన్య నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరియర్ పైన ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లో చేస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇలా యాడ్ చేసి మరొక సారి అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.


సమంత కెరియర్..

ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ హనీ బన్నీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఈ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకోబోతోందని అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. మొత్తానికి అయితే హనీ బన్నీ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్ ,టీజర్ అన్నీ కూడా వెబ్ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచేశాయి. మొత్తానికైతే ఈ వెబ్ సిరీస్ తో హాలీవుడ్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోబోతుందని చెప్పవచ్చు.

సమంత ఇండస్ట్రీ ప్రయాణం..

సమంత విషయానికి వస్తే.. 2007లో రవి వర్మ దర్శకత్వంలో వచ్చిన మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా.. తన తొలి చిత్రం ఏ మాయ చేసావే సినిమాలోనే 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆపై ఈమె నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి అతి తక్కువ సమయంలోనూ తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఏకకాలంలో తమిళ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరియర్ పై దృష్టి పెట్టి మంచి పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పటికే ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు హిందీలో మంచి పేరు దక్కించుకొని, హాలీవుడ్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×