BigTV English
Advertisement

Mahesh Babu -Namratha : మహేష్ బాబు కు నమ్రత దూరం.. ఆ డైరెక్టర్ వల్లే అంతా?

Mahesh Babu -Namratha : మహేష్ బాబు కు నమ్రత దూరం.. ఆ డైరెక్టర్ వల్లే అంతా?

Mahesh Babu -Namratha : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ జంటలలో మహేష్ బాబు, నమ్రత జంట కూడా ఒకరు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచినా ఈ జంట మధ్యన దూరం పెరిగిందనే వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.. అదేంటి ఏమైందనే సందేహాలు ఫ్యాన్స్ కు వస్తాయని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి ఒక డైరెక్టర్ కారణం అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


నిజానికి ఈ జంట మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి.. అసలు అంతలా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా వరల్డ్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది అంటే 2025 మొదటి నెలలోనే సినిమాను మొదలు పెట్టనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ పూర్తిగా మారిపోయింది. ఈ మూవీలో మహేష్ గుబురు గడ్డం, జుట్టు తో కనిపించునున్నాడు.. జుట్టు గడ్డం పెంచడంతో రాజమౌళి నుంచి రాబోతున్న సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన హైప్ పెరిగింది. ఇదంతా పక్కన పెడితే నమ్రత, మహేష్ బాబులకు ఈ సినిమా విషయంలోనే గ్యాప్ వచ్చిందంటూ వార్తలు వైరల్ వినిపిస్తున్నాయి.

నమ్రత, మహేష్ బాబు జంట మధ్య గొడవలు రావడానికి జక్కన్న ఏ విధంగా కారణం అనేది ఇప్పుడు ప్రశ్నర్ధకంగా మారింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఏ సినిమాకైనా హీరో కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. రాజమౌళి భార్య రామా రాజమౌళి వ్యవహరిస్తుంది. ఇక మహేష్ సినిమాల్లో కాస్ట్యూం డిజైనర్ గా నమ్రత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జక్కన్న సినిమా కోసం మహేష్ బాబు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా రమా రాజమౌళి ఉంటుందట. దాంతో నమ్రత ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మహేష్ బాబు భార్యగా సినిమా షూటింగ్ కు వెళ్లొచ్చు తప్ప తన పక్కన ఉండటం కుదరదు. ఈ క్రమంలో మహేష్ ఫోటోషూట్ కి వెళ్ళినా.. నమ్రత ఆయనతో వెళ్లడానికి అసలు ఇష్టపడడం లేదని.. దీంతో మహేష్ ఒంటరిగా ఫోటోషూట్స్ కు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. అలా జక్కన్న సినిమా కారణంగా మహేష్ నమ్రతల మధ్యన దూరం పెరుగుతుందంటూ వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల పై నమ్రత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇక మహేష్ బాబు సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ కాస్త మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక జక్కన్న తో చేస్తున్న సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు. ఈ సినిమా రావడానికి ఎలాగో మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు మహేష్ మరో ప్రాజెక్టు చెయ్యలేడు.. ఆ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×