BigTV English

Samantha: గోల్డెన్ ఛాన్స్.. మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత!

Samantha: గోల్డెన్ ఛాన్స్.. మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత!

Samantha With Another new Web Series: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న విషయంం తెలిసిందే. అయితే సమంత.. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.


ముఖ్యంగా సామూహిక అత్యాచారానికి గురై, తమ్ముడిని కోల్పోయిన బాధితురాలిగా, జాతి గౌరవం కోసం పోరాడే రెబల్ కమాండర్‌గా చేసిన రాజీ క్యారెక్టర్‌లో సమంత నటన కొత్తగా అనిపించినా గుర్తుండిపోతుంది. రాజ్ అండ్ డీకే సంయుక్తంగా ది ఫ్యామిలీ మెన్ ఫ్రాంచైజ్ లో సిరీస్ 2 గా దీనిని తెరకెక్కించారు.

ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తర్వాత అదే దర్శకులతో సమంత సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కూడా చేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు ది ఫ్యామిలీ మెన్ ఫ్రాంచైజ్ నెక్స్ట్ సీజన్‌లో కూడా సమంత భాగం కావాలని భావిస్తోంది.


అయితే, రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కంటే ముందుగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. ‘రక్తబీజ్’ టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ మెయిన్ లీడ్ గా చేస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట.

‘రక్తబీజ్’ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో సమంత చేసే పాత్ర ఏంటనేది రివీల్ కాలేదు. ఇలా వరుస వెబ్ సిరీస్ ల ద్వారా సమంత బాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది. దీని తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుంది. అయితే సరైన ప్రాజెక్ట్ రాకపోవడంతో ఆలస్యమవుతోంది.

మరోవైపు ఆదిత్య రాయ్ కపూర్ ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆదిత్యకు ‘రక్తబీజ్’ సెకండ్ వెబ్ సిరీస్ కావడం విశేషం. గతేడాది గుమ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిత్య..ప్రస్తుతం మెట్రో సినిమా చేస్తున్నాడు.  ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇందులో ఆదిత్యకు జోడిగా సారా అలీఖాన్ నటిస్తోంది.

Also Read: చీరకట్టులో బజ్జీల పాప.. ఏమా అందం.. ఏమా అందం

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×