E-Paper
Advertisement

Samantha : తోడుగా నేనుంటా… నెటిజన్ ప్రపోజల్ కు సామ్ హార్ట్ ఫెల్ట్ రిప్లై

Samantha : తోడుగా నేనుంటా… నెటిజన్ ప్రపోజల్ కు సామ్ హార్ట్ ఫెల్ట్ రిప్లై
Advertisement

Samantha : సౌత్ క్వీన్ సమంత (Samantha) ప్రస్తుతం ‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే సెషన్ నిర్వహించగా, ఓ అభిమాని ఏకంగా సమంత ముందు ప్రపోజల్ పెట్టాడు. ‘నేను నీకు తోడుగా ఉంటాను’ అంటూ అతను చేసిన కామెంట్ కి సమంత స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే…

ఏడాది తర్వాత సమంత ‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్ తో వెండితెరపై అభిమానులను అలరించబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ముంబైతో పాటు పలు నగరాలు చుట్టేస్తూ ఎక్కువ మందికి ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. మీడియాతో ముచ్చటిస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెడుతున్న సామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో సందడి చేసే ఈ బ్యూటీ తాజాగా తన ఫాలోవర్స్ తో మాట్లాడేందుకు ఇన్స్టా లో చిట్ చాట్  నిర్వహించింది.

Advertisement

అయితే అందులో భాగంగానే నెటిజన్లు ఆమెపై పలు ప్రశ్నలను సంధించారు. ఎంతో ఓపికగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుకొచ్చిన సామ్ (Samantha) ఓ నెటిజన్ తనపై ప్రేమను వ్యక్తం చేయడంపై ఆసక్తికరంగా స్పందించింది. సదరు నెటిజన్ ‘నిన్ను చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. తోడుగా నీకు ఎవరూ లేకపోతే ఆ టైంలో నేను ఉంటాను లవ్ యు సమంత’ అని కామెంట్ చేశాడు. దీంతో ఫిదా అయినా సమంత ‘మీ ప్రేమే నాకు కొండంత బలం’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సమంత, నెటిజన్ మధ్య జరిగిన ఈ డిస్కషన్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మరోవైపు సమంత (Samantha) తన వెయిట్ లాస్ గురించి చేసిన ట్రోలింగ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘మయోసైటిస్ కారణంగా వైద్యుల సలహా ప్రస్తుతం తాను స్ట్రిక్ట్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉండడం వల్ల బరువు తగ్గాను అని సమాధానం చెప్పడంతో పాటు ఆ ప్రశ్న అడిగిన వారిపై ఫైర్ అయ్యింది.

Advertisement

ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ , సమంత కలిసి నటించిన ‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే దీనికి కూడా దర్శకత్వం వహించారు. కాగా ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ కు ‘సిటాడెల్ : హనీ బన్నీ’ ఇండియన్ వెర్షన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో సమంత యాక్షన్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక మేకర్స్ కూడా ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×